Pages

Friday, 30 December 2016

Health benefits of dry grapes



Health benefits of dry grapes




Health benefits of sapota fruit


Health benefits of sapota fruit






సపోటా పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఈ పండును రోజు వారీగా ఒకటి రెండు తీసుకుంటే విటమిన్ సి లభిస్తుందట. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు సపోటా పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో పీచు పదార్థం ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ప్రోటీన్లు, ఐరన్ శక్తి అధికంగా ఉండే ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. క్రీడాకారులకు ఎంతో శక్తి అవసరం అందువల్ల, వారిని సపోటా పండు తినమని సిఫార్సుచేయబడింది.
సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు, విటమిన్ A ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుండి రక్షణను అందిస్తుంది. ఎముకల పటుత్వాన్ని పెంచడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో అవసరం. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల, సపోటా పండు ఎముకల గట్టితనానికి, విస్తరణకు బాగా సహాయపడుతుంది.
పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. ఇది నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు బాక్టీరియా మనవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. సపోటా పండు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది. సపోటా పండు చాతీ పట్టేసినపుడు, దీర్ఘకాల దగ్గు ఉన్నప్పుడు ముక్కు నాళాలలో నుండి దగ్గు, శ్లేష్మం తొలగించడం ద్వారా జలుబు, దగ్గు తగ్గడానికి దోహదంచేస్తుంది.

Wednesday, 28 December 2016

Benefits of Lady's finger

Benefits of Lady's finger





బెండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది..!
బెండకాయ కూర అంటే చాలా మంది ఇష్టపడతారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు కూరల్లో ఎక్కువగా వాడతారు. అయితే బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయల వల్ల ఉన్న ప్రయోజనాలు చూద్దాం.
బెండకాయల్ని నిలువుగా చీల్చి రెండు భాగాలుగా గ్లాసుడు నీటిలో నీటిలో రాత్రంతా ఉంచి మర్నాడు ముక్కలు తీసి వేసి ఆ నీటిని తాగితే షుగర్‌ అదుపులో ఉంటుంది. బెండకాయల్లో ఎక్కువగా ఉండే ఎ, బి, సి విటమిన్లు పలు పోషక పదార్థాలు, అయోడిన్‌ అనేక రకాల అనారోగ్యాలకు చెక్‌ పెడతతాయి. బెండకాయలు తింటే విజ్ఞానం, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట.
బెండకాయల్లోని మ్యూకస్‌ వంటి పదార్థం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్‌ సమ్యలకు ఎసిడిటీకి చక్కని పరిష్కారం. డయాబెటిసితో బాధపడేవారు ఎక్కువగా బెండకాయలతో చేసిన వంటకాలు తినడం మంచిది. సో వీలైనంతగా బెండకాయల్ని మీ ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండండి.

Friday, 25 November 2016

Simple medicine to reduce 300 kinds of decease



Simple medicine to reduce 300 kinds of decease






ఆరోగ్యం 
300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్ ఇది..


మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. అసలు 4, 5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకుపైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు.
మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు
* మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు
ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.
* పాల నుంచి లభించే క్యాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.
* పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.
* అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.
* మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.
* ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో
తేలింది. యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది.
* థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.
* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట.
అద్భుతమైన ఔషద సంజీవని మన మునగాకు
మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
నీరు – 75.9 శాతం
పిండి పదార్థాలు – 13.4 గ్రాములు
ఫ్యాట్స్ – 17 గ్రాములు
మాంసకృత్తులు – 6.7 గ్రాములు
కాల్షియం – 440 మిల్లీ గ్రాములు
పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు
ఐరన్ – 7 మిల్లీ గ్రాములు
‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు
ఖనిజ లవణాలు – 2.3 శాతం
పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు
ఎనర్జీ – 97 కేలరీలు
ఔషధ విలువలు అద్భుతం
ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.
మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు…
మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా?

Natural Lever cleaner



Natural Lever cleaner 



Benefits of Miriyalu



Benefits of Miriyalu




* మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.
* వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్‌ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది. 
* ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.
* మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి.
* వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది. 
* మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది. 
* కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది. 
* వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్‌ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి. 
దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.
* మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
‪* చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
‪* ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు.
* మిరియాలతో చేసిన టీ విటమిన్ ‘C’ని కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.

Thursday, 15 September 2016

Prevention from Dengue Mosquito

Prevention of Dengue Mosquito