Pages

Saturday, 13 February 2016

Steps to improve porn empire with pumpkin seeds ..గుమ్మడి గింజలు.. శృంగార సామ్రాజ్యానికి సోపానాలు



Steps to improve porn empire with pumpkin seeds ..గుమ్మడి గింజలు.. శృంగార సామ్రాజ్యానికి సోపానాలు

గుమ్మడి గింజలు.. శృంగార సామ్రాజ్యానికి సోపానాలు
మానవ మనుగడలో అతి కీలకపాత్ర పోషించేది శృంగారం. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో అది తన ప్రాధాన్యాన్ని కోల్పోతోంది. తీరిక లేకపోవడం ఒకవైపు, డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి పలురకాల వ్యాధులు మరోవైపు శృంగారాసక్తిని చంపేస్తున్నాయి. దాంతో ఏదో మొక్కుబడిగా పిల్లల కోసమే చాలా మంది సెక్స్‌ చేస్తున్నారు. చాలామందికి నడివయసుకొచ్చేసరికి శృంగార సామర్థ్యం తగ్గుతుంది. అయితే వారు ఆ విషయమై డాక్టర్లను కలవడానికి సంకోచిస్తున్నారు. డాక్టర్ల వద్దకు వెళ్లలేకపోయినా.. కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సెక్స్‌ సామర్థ్యం కొంతవరకైనా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనవి గుమ్మడికాయ గింజలు.
గుమ్మడి పిక్కలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఈ పిక్కల్లో జింక్‌ పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది మగవారిలో టెస్టొస్టిరాన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుందని రుజువైంది. యాంటీ ఆక్సిడెంట్ సెలెనియంతో పాటు విటమిన్లు ఇ, సి, డి, కె, బి నిండి ఉన్న గుమ్మడి గింజలు శృంగార సామ్రాజ్యానికి సోపానాలు. వీర్యంలో కీలకమైన శుక్రకణాల వృద్ధికి ఈ గింజలు ఎంతో ఉపకరిస్తాయి. వీటిలోని మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు మగతనాన్ని మెరుగుపరచడంలో ముందుంటాయి. శృంగార సామ్రాజ్యంలో పురుషులకు పోటీగా స్త్రీలకూ అదే స్థాయిలో గుమ్మడి గింజలు ప్రయోజనాలు అందజేస్తాయి.
సాధారణ ఆరోగ్యం విషయానికొస్తే.. మన శరీరంలో ధమనులకు దన్నుగా నిలుస్తాయి గుమ్మడి గింజలు. మూత్ర సంబంధ సమస్యల్ని నివారించడానికి శతాబ్ద కాలానికి ముందు నుంచే నాటి సంప్రదాయ వైద్యులు ఈ గింజల్ని ఉపయోగించేవారట. గుండె జబ్బుల నివారణ, కొవ్వుతో పాటుగా కిడ్నీలో రాళ్ళను కరగదీయడంలోను ఈ పిక్కల పనితీరే వేరు. ఈ గింజలను పచ్చిగా తినవచ్చు, కాస్తంత ఆలివ్ ఆయిల్‌లో వేయించుకుని కూడా తినవచ్చు.

Treasure of natural medicinal properties of neem....వేప సహజ ఔషధ గుణాల నిధి



Treasure of natural medicinal properties of neem....వేప సహజ ఔషధ గుణాల నిధి
జుట్టుకు వేపాకు బెస్ట్‌
1.వేప సహజ ఔషధ గుణాల నిధి. వేపతో చర్మసంబంధమైన వాటితో పాటు జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.
2.వేపాకు చూర్ణాన్ని వారానికి ఒకసారి జుట్టుకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
3.వేపనూనెతో వారానికి రెండుసార్లు హెడ్‌ మసాజ్‌ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది.
4.జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకు పేస్ట్‌తో నెలకు రెండుసార్లు మాస్క్‌ వేసుకుంటే కురుల్లో మెరుపు వస్తుంది.
5.తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నాన బెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుంది.
గోరు వెచ్చని రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని అందులోకి మూడు టేబుల్‌ స్పూన్ల వేపనూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడతాయి.
గుప్పెడు వేపాకుల్ని బాగా ఉడికించి, పేస్ట్‌ చేసి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
ఒక బౌల్‌లో వేపాకుపే్‌స్టను తీసుకుని అందులోకి గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమంతో తలకు మాస్క్‌ వేసుకుంటే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.



Health benefits of Guava fruits....జామ పండ్లు ఎక్కువగా తినండి...మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి



Health benefits of Guava fruits....జామ పండ్లు ఎక్కువగా తినండి...మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి

జామ పండ్లు ఎక్కువగా తినండి...మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి
మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండునో, లేక బలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా వాడతూ ఉంటాము.
ఇక మీదట అలా చేయ వలసిన పని లేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని బలపరచటానికి ఎక్కువగా ఉపయోగ పడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన పరిశోధనలో తెలిసింది.
ఎలాగంటే, మనం ఆరోగ్యంగా ఉండటానికి మనకు యాంటీ-ఆక్సిడెంట్స్ అతి ముఖ్యంగా కావలసి యున్నది. మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము.ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ మనలో ఉన్న కొన్ని జీవ కణాలు కూడా పాడవుతూ ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్స్ ఈ జీవ కణాలు పాడైపోకుండా కాపాడతుంది. ఇంతే కాకుండా వయసుతో పాటు మనకు ఏర్పడే డీ-జెనరేటివ్ వ్యాధులనూ, క్యాన్సర్ వ్యాధినీ మరియూ ముసలితనాన్ని(Early Aging) అరికట్టడంలో సహాయపడుతుంది. కనుక ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ మనకు చాలా అవసరమన్నమాట. అదీ ప్రక్రుతి ఆకారంలో దొరికితే చాలా మంచిది.
జామ పండులో యాంటీ-ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగానూ, పైనాపిల్ పండులో అతి తక్కువగానూ ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది.
ఇండియన్ ప్లం, మామిడి పండు, దానిమ్మ పండు, సీతాఫలం మరియూ ఆపిల్ పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉన్నదని పైనాపిల్,అరటి పండు, బొప్పాయి, పుచ్చకాయ మరియూ ద్రాక్ష పండ్లలో తక్కువగా ఉన్నదని తెలిపేరు.
ఖరీదైన పండ్లు ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాము. కానీ తక్కువ ఖరీదు గల జామ పండు ఆరోగ్యానికి అతి మంచిదని తెలిసింది. ఈ క్రింది పట్టీలో ఏ ఏ పండ్లలో ఎంత శాతం యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది.(100 గ్రాముల పండులో ఎన్ని మిల్లిగ్రాముల యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది).
జామ పండు....496.
ఇండియన్ ప్లం....330
సీతాఫలం....202
మామిడి పండు....170
దానిమ్మ పండు....135
ఆపిల్ పండు....123
ద్రాక్ష పండు... 85
బొప్పాయ పండు....50
అరటి పందు....30
ఆరెంజ్ పండు...24
పుచ్చకాయ...23
పైనాపిల్....22
కనుక ఇక మీదట మీకు పండు తినాలనిపిస్తే జామ పండుకు మొదటి చాయిస్ ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి.

How to Lose your Belly Fat Naturally...నిద్రకు ముందు ఇది తాగితే..! బెల్లీ ఫ్యాట్ దూరం



How to Lose your Belly Fat Naturally...నిద్రకు ముందు ఇది తాగితే..! బెల్లీ ఫ్యాట్ దూరం



బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్. చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్, డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని ఫాలో అయినా ఫలితం కనిపించనప్పుడు.. మధ్యలోనే వదిలేయడం కామన్ గా జరిగిపోతోంది. కానీ మెటబాలిజం ప్రక్రియ ఎలా జరుగుతుందని.. దాన్ని ఎలా సక్రమంగా సాగేలా జాగ్రత్తపడతారో.. వాళ్లకు బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది.
మెటబాలిక్ రేటు వయసు, జెండర్, మజిల్ మాస్ ని బట్టి వర్క్ అవుతుంది. మహిళల్లో కంటే.. మగవాళ్లలలో మెటబాలిజం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. మగవాళ్లలో కండరాల సౌష్టవం బలంగా ఉంటుంది కాబట్టి. అయితే మెటబాలిజం రేటుని పెంచితే.. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అయితే మెటబాలిజం స్థాయిని పెంచడానికి ఈ సింపుల్ డ్రింక్ ప్రయత్నించండి. ఇది మీ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు దీన్ని తీసుకోవాలి.
2 గ్రేప్ ఫ్రూట్స్ , 1 టేబుల్ స్పూన్ అల్లం రసం, అర టీ స్పూన్ దాల్చిన చెక్క, అరగ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి బాగా మిక్స్ చేయాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్ తాగాలి. ఇలా 12 రోజులు తాగిన తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 12 రోజులు కంటిన్యూగా తాగాలి. ఇలా ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ అందడంతో పాటు, బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.

After one hour of meal we have to eat it..భోంచేశాక గంట తరవాత ఇవి తినాలి...!





భోంచేశాక గంట తరవాత ఇవి తినాలి...!

భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా!

• ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు భోంచేశాక ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోంచేశాక గంట తరవాత దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగి తీసుకుంటే ఇంకా మంచిది.

• అరటిపండ్లు: ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.

• బొప్పాయి: కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

• అనాస: ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

• అంజీరా: గుప్పెడు అంజీరాలో పదిహేను గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.