Pages

Friday, 22 July 2016

To cut of the belly fat........


To cut of the belly fat........ 



పొట్ట దగ్గర కొవ్వు ఉంటే చూసేవాళ్ళకి లేని ఇబ్బంది కూడా మనకే ఉంటుంది. చూడ్డానికి ఎలా ఉన్నాం అనేదాన్ని పక్కనపెడితే, పొట్ట దగ్గర కొవ్వు ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు ఇలా చెప్పుకుంటేపోతే పదుల సంఖ్యలో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
పొట్ట మంచి షేపులో ఉండాలంటే కేవలం వ్యాయామాలు చేస్తే సరిపోదు. మంచి ఆహారం కూడా తీసుకోవాలి.

రోజుకి కనీసం వంద కెలరీలు ప్రొటీన్ల ద్వారా బాడిలోకి చేరాలి. చికెన్, గుడ్లు, పాలు, మీగడ తీసిన పెరుగు మంచి మోతాదులో పోషకాలను అందిస్తాయి. కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండే ఆహారం మీద మనసుపెట్టాలి.

కొవ్వు అదుపులో ఉండాలంటే రోజుకి కనీసం పదిగ్రాముల ఫైబర్ శరీరంలో చేరాలి. ఇందుకోసం యాపిల్,పుచ్చకాయ, దోసకాయ,ముల్లంగి, టొమాటో,క్యాబేజీ, చిలగడదుంప, కాయగూరలు, అటుకులు, పొట్టు తీయని తృణధాన్యాలు, బీన్స్, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే పీచు పదార్థాలు వలన గ్యాస్ ఏర్పడుతుంది. కాబట్టి నీళ్ళు బాగా తాగాలి. కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు రోజు తాగాలి.

ఇలా మంచి ఆహార అలవాట్లతో పాటు, క్రమం తప్పని వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే పొట్ట సరైన షేపులో ఉంటుంది.

Dates are protein's power house.....ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌస్ అంటారు


Dates are protein's power house.....ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌస్ అంటారు 


ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌస్ అంటారు. ఆ ఎడారి పళ్ళకున్న విశిష్టత అంతాఇంతా కాదు. ఏ పండైనా మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక చాలామంది ఖర్జూరాలను తీసుకుంటారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి.

ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను ఈ పండ్లు అరికడుతాయి. గర్భణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువుగా అవుతుంది.

రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు. ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.

Health benefits of drumstick's.............

Health benefits of drumstick's.............



రసం, సాంబారులోనే కాదు...మునక్కాయ కూర వండుకున్నా ఆ రుచి మరి దేనికీ సాటి రాదు. మరి పోషకాలో అంటారా? విలువైన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్లు అందిస్తుంది మునగ. మరి వాటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో చూద్దామా.

మునగలో అధికంగా లభించే క్యాల్షియం, ఇనుము.. ఇతర విటమిన్లు ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. పిల్లలు మునగను కూరలా తిన్నా, సూప్‌రూపంలో తాగినా.. ఎముకలు గట్టిగా మారతాయి.

* రక్త శుద్ధికి... మునగలో ఉండే గింజలూ, ఆకులు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి. మునగ యాంటీబయాటిక్‌ కారకంగానూ పనిచేస్తుంది. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల మొటిమలతో పాటు ఇతర చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులూ అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహం సమస్య చాలామటుకూ నియంత్రణలో ఉంటుంది. గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల్ని అదుపు చేస్తుంది మునగ.

* గర్భిణులకు మంచిది... గర్భం దాల్చినప్పుడు మునగను తీసుకోవడం వల్ల ప్రసవానికి ముందు, తరవాత వచ్చే సమస్యల్ని చాలామటుకూ తగ్గించుకోవచ్చు.మునగ తల్లిపాలు పుష్కలంగా వచ్చేలా చేస్తుంది. ఆకుల్లోనూ, మునగ పూలల్లోనూ యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది విటమిన్‌ సిని కూడా శరీరానికి అందిస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి. అంతేనా శరీరానికి హాని చేసే ఫ్రీ రాఢికల్స్‌ ప్రభావం కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి పనితీరు మెరుగుపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.

For activeness, we have to eat the following foods....రోజంతా చురుగ్గా ఉండాలన్నా, జుట్టూ, గోళ్లూ వంటివి ఆరోగ్యంగా పెరగాలన్నా ఆహారంలో మాంసకృత్తుల పాత్రే కీలకం. అందుకోసం ఈ పదార్థాలు తీసుకోండి

For activeness, we have to eat  the following foods....రోజంతా చురుగ్గా ఉండాలన్నా, జుట్టూ, గోళ్లూ వంటివి ఆరోగ్యంగా పెరగాలన్నా ఆహారంలో మాంసకృత్తుల పాత్రే కీలకం. అందుకోసం ఈ పదార్థాలు తీసుకోండి


* సెనగలు:

వీటిల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పీచుతోపాటూ ఆరోగ్యానికి మేలుచేసే కొలెస్ట్రాల్‌ని అందిస్తాయివి. వీటిలో మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్‌ లాంటి పోషకాలుంటాయి. ఇవి ఎముకలకు మేలుచేస్తాయి. కప్పు సెనగలు తీసుకుంటే 18 నుంచి 22 గ్రాముల మాంసకృత్తులు అందుతాయి.

* పప్పుధాన్యాలు:

ప్రతిరోజూ ఏదో ఒక పప్పును పిల్లలకు తినిపించాలి. కప్పు పప్పు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవైగ్రాముల మాంసకృత్తులు అందుతాయి.


* సోయా:

మాంసాహారానికి దీటైన ప్రత్యామ్నాయంగా చెప్పే సోయాలో ప్రొటీన్‌శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదనంగా మరికొన్ని ఖనిజాలూ, విటమిన్లూ ఉంటాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. కప్పు సోయా గింజల్ని తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడే ప్రొటీన్లు శరీరానికి అందుతుంది.

* పెరుగు:

ఇది మాంసకృత్తుల్నే కాదు, శరీరానికి మేలుచేసే.. ప్రొబయోటిక్స్‌నీ అందిస్తుంది. చిన్న కప్పు పెరుగు తీసుకున్నా కూడా పది నుంచి పన్నెండు గ్రాముల మాంసకృత్తులు శరీరానికి అందుతాయి.
• కప్పు పాలకూర చాలు!

* పాలకూర:

కప్పు పాలకూర సగం గుడ్డుతో సమానం అంటారు. ఇంకా సూటిగా చెప్పాలంటే కప్పు పాలకూర నుంచి ఏడు నుంచి పది గ్రాముల మాంసకృత్తులను పొందవచ్చు.