Friday, 30 December 2016
Health benefits of sapota fruit
Health benefits of sapota fruit
సపోటా పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఈ పండును రోజు వారీగా ఒకటి రెండు తీసుకుంటే విటమిన్ సి లభిస్తుందట. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు సపోటా పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో పీచు పదార్థం ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ప్రోటీన్లు, ఐరన్ శక్తి అధికంగా ఉండే ఈ పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. క్రీడాకారులకు ఎంతో శక్తి అవసరం అందువల్ల, వారిని సపోటా పండు తినమని సిఫార్సుచేయబడింది.
సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు, విటమిన్ A ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుండి రక్షణను అందిస్తుంది. ఎముకల పటుత్వాన్ని పెంచడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అధిక మొత్తంలో అవసరం. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల, సపోటా పండు ఎముకల గట్టితనానికి, విస్తరణకు బాగా సహాయపడుతుంది.
పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. ఇది నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
సపోటా పండు అనేక యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు బాక్టీరియా మనవ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. సపోటా పండు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది. సపోటా పండు చాతీ పట్టేసినపుడు, దీర్ఘకాల దగ్గు ఉన్నప్పుడు ముక్కు నాళాలలో నుండి దగ్గు, శ్లేష్మం తొలగించడం ద్వారా జలుబు, దగ్గు తగ్గడానికి దోహదంచేస్తుంది.
Wednesday, 28 December 2016
Benefits of Lady's finger
Benefits of Lady's finger
బెండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది..!
బెండకాయ కూర అంటే చాలా మంది ఇష్టపడతారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు కూరల్లో ఎక్కువగా వాడతారు. అయితే బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..? బెండకాయల వల్ల ఉన్న ప్రయోజనాలు చూద్దాం.
బెండకాయల్ని నిలువుగా చీల్చి రెండు భాగాలుగా గ్లాసుడు నీటిలో నీటిలో రాత్రంతా ఉంచి మర్నాడు ముక్కలు తీసి వేసి ఆ నీటిని తాగితే షుగర్ అదుపులో ఉంటుంది. బెండకాయల్లో ఎక్కువగా ఉండే ఎ, బి, సి విటమిన్లు పలు పోషక పదార్థాలు, అయోడిన్ అనేక రకాల అనారోగ్యాలకు చెక్ పెడతతాయి. బెండకాయలు తింటే విజ్ఞానం, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట.
బెండకాయల్లోని మ్యూకస్ వంటి పదార్థం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమ్యలకు ఎసిడిటీకి చక్కని పరిష్కారం. డయాబెటిసితో బాధపడేవారు ఎక్కువగా బెండకాయలతో చేసిన వంటకాలు తినడం మంచిది. సో వీలైనంతగా బెండకాయల్ని మీ ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండండి.