Pages

Tuesday, 17 February 2015

Using mustard oil and Henna leaves For Faster Hair Growth


Using mustard oil and Henna leaves For Faster Hair Growth



About 250 ml of mustard oil should be boiled in a tin basin. About sixty grams of henna leaves should be gradually put in this oil till they are burnt in the oil. The oil should then be filtered using a cloth and stored. Regular massage of the head with the oil will produce Healthy hair.

Monday, 16 February 2015

Coconut oil and Garlic for faster Hair Regrowth




Coconut oil and Garlic for faster Hair Regrowth

Crush several garlic cloves and mix with two cups of coconut oil. Boil this for just a few minutes and stir gently. After the mixture cools, apply it to your scalp with a gentle massaging motion. Repeat these remedies two to three times a week for maximum results.

Friday, 6 February 2015

చుండ్రు ఇక కనిపించదు ..!


చుండ్రు ఇక కనిపించదు ..!

చికాకు తెప్పించే సమస్య చుండ్రు. రోజూ షాంపూ పెట్టి స్నానం చేసినా కొన్నిసార్లు చుండ్రు వదలదు. చుండ్రు రావడానికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన కారణమైనా, ఇతర కారణాలు కూడా ఉంటాయి. పొల్యూషన్‌, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నరాల జబ్బులు, శుభ్రత పాటించకపోవడం వంటివి కారణమవుతాయి. అయితే మెడికేటెడ్‌ షాంపూల అవసరం లేకుండానే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చుండ్రు దూరం చేసుకోవచ్చు.

అలాంటి చిట్కాలు
నాలుగు మీకోసం...!

• వారంలో రెండు రోజులు తలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయండి. ఆలివ్‌ ఆయిల్‌లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి. రాత్రి పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి తలచుట్టూ టవల్‌ లేక స్కార్ఫ్‌ కట్టుకుని పడుకుంటే ఆయిల్‌ బాగా అబ్జార్బ్‌ అవుతుంది.

• నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీటితో కడుక్కోవాలి.

• అలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది.

• మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి నెల పాటు చేయాలి. చుండ్రు ఛాయలు కనిపించకుండా పోతాయి.



How to reduce the fat in the body ఫ్యాట్‌ను తగ్గించే ఫుడ్స్‌...!



ఫ్యాట్‌ను తగ్గించే ఫుడ్స్‌...!

జీవనశైలిలో మార్పుల వల్ల, నిత్యం వ్యాయామం కొరవడటం వల్ల శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఫ్యాట్‌ను తగ్గించడానికి ఆరు రకాలైన సూపర్‌ఫుడ్స్‌ ఉన్నాయి.

శరీర లావునే కొవ్వు అని భావిస్తుంటాం. కానీ మన శరీరంలో మూడు రకాలైన ఫ్యాట్‌లు ఉన్నాయి. ఒకటి బాడీ ఫ్యాట్‌. రెండు బ్లడ్‌ ఫ్యాట్‌. మూడవది ఫుడ్‌ ఫ్యాట్‌. ఈ మూడింటికీ సన్నిహిత సంబంధం ఉంది. అయితే వీటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. బ్లడ్‌ ఫ్యాట్‌ని లిపిడ్స్‌ అంటాం. ఇవి రక్తంలో ట్రైగ్లిసరైడ్స్‌, కొలసా్ట్రల్‌ రూపంలో ఉంటాయి. కొలసా్ట్రల్‌ కాంపొనెంట్స్‌ కూడా శరీరానికి అవసరమే కానీ పరిమితికి మించి ఇవి ఉండకూడదు. ముఖ్యంగా లిపిడ్‌ ప్రొఫైల్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో తేడాలు తలెత్తితే రకరకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఫుడ్‌ ఫ్యాట్స్‌ అంటే ఆయిల్స్‌, నెయ్యి, వెన్న, హైడ్రోజెనేటడ్‌ ఫ్యాట్స్‌ మొదలైనవి. ఇవి కొలసా్ట్రల్‌ను పెంచుతాయి.
శరీరాన్ని స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కొలసా్ట్రల్‌ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఆరు సూపర్‌ ఫుడ్స్‌ ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది. ఊబకాయులు కారు. ఆరోగ్యంగా ఉంటారు. లిపిడ్స్‌ కూడా సాధారణస్థాయిలో ఉంటాయి.

గుడ్లు:

తెల్లసొనలో ప్రొటీన్లు బాగా ఉంటాయి. పచ్చసొనలో కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తెల్లసొన వల్ల మనలోని కొవ్వు సహజసిద్ధంగా కరుగుతుంది. గుడ్డు తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. ఉడకబెట్టిన తెల్లసొన, ఒక కప్పు పండ్లు, కూరగాయలు తింటే ఆ పూట భోజనం చేయాల్సిన పనిలేదు.

ఒమేగా 3 ఫుడ్స్‌:

ఇవి శరీరంలోని ఫ్యాట్‌ను , రక్తంలోని ఫ్యాట్‌ను నియంత్రిస్త్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. మకెరల్‌, ట్యూనా లాంటి చేపల్లో ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ బాగా ఉంటాయి. వీటిని తింటే ఎంతో మంచిది. అలాగే అవిశలు, అవిశనూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఊబకాయం తగ్గించుకోవడానికి డైటింగ్‌ చేసేవాళ్లు ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను సప్లిమెంట్ల రూపంలోగాని, ఆహారం రూపంలోగానీ తీసుకోవాలి.
పప్పుధాన్యాలు: వీటిల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే సమతులాహారం తీసుకున్నట్టే. ఉదాహరణకు రాజ్మా, పెసలు, సెనగలు లాంటి వాటిని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి మర్నాడు ఉదయం వాటిని ఉడకబెట్టుకుని తింటే శరీరానికి ఎంతో మంచిది. పప్పులను ఉడకబెట్టి తినడం వల్ల కడుపులో గ్యాసు ఏర్పడదు. సులభంగా జీర్ణం అవుతాయి. పొట్టుతో సహా తింటే ఇంకా మంచిది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల బ్లడ్‌ షుగర్‌, బ్లడ్‌ ఫ్యాట్స్‌ పెరగవు. అంతేకాదు ఏదో ఒకటి తినాలనే యావ ఉండదు. ఒకప్పుడు ఉడకబెట్టిన పప్పుధాన్యాలు తింటే ఆకలి ఉండదు. అవి తింటే ఆ పూట ఇక అన్నం తినాల్సిన పని లేదు.

ఓట్స్‌:

ఓట్స్‌లో అత్యధికస్థాయిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది బ్లడ్‌ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఓట్స్‌కు నెయ్యి, నూనె, వెన్నలాంటివి జోడించి తింటే శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. అలాకాకుండా ఓట్స్‌లో కొన్ని కూరగాయముక్కలు లేదా పాలు పోసి బాగా ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో కొద్దిగా తేనె లేదా సాల్ట్‌ పెప్పర్‌ వేసుకుని కూడా తినొచ్చు. ఓట్స్‌ తింటే తొందరగా ఆకలి వేయదు.

బాదంపప్పులు:

బాదం పప్పులు క్రేవింగ్‌ను అరికడతాయి. వీటిల్లో ప్రొటీన్‌, ఎసెన్షియల్‌ ఫ్యాట్‌, పీచుపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. న్యూట్రియంట్స్‌ కూడా అధికంగా ఉంటాయి. ఒక వ్యక్తి రోజుకు 45 బాదంపప్పులు తినొచ్చు. స్నాక్స్‌లా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇవి రక్తంలోని కొలసా్ట్రల్‌ను నియంత్రిస్తాయి. వీటిని తినడం వల్ల కొలసా్ట్రల్‌ పెరగదు.

పళ్లు, కూరగాయలు:

తక్కువ క్యాలరీలిచ్చే ఆహారం పళ్లు, కూరగాయలు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కూరగాయలను ఉడకబెట్టి తింటే బరువు బాగా తగ్గుతారు. తాజా పళ్లు తిన్నా కూడా బరువు తగ్గుతారు. సలాడ్‌లు కూడా మంచివే. వాటిల్లో రుచికోసం మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తినొచ్చు. సలాడ్‌లను స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. పళ్లు, కూరగాయల్లో సొల్యుబుల్‌, నాన్‌సొల్యుబుల్‌ పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి బ్లడ్‌ ఫ్యాట్‌ అంటే కొలసా్ట్రల్‌ని పెరగకుండా అరికడతాయి.

What to do for silkey & Shiney Hair పట్టులాంటి కురుల కోసం....



పట్టులాంటి కురుల కోసం....

జుట్టు ఊడిపోతుందని, పలుచబడిపోతుందని, మెరుపు కోల్పోతుందని బాధపడని వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కాలుష్యం, ఒత్తిడి, పోషకాహారలేమి... ఇటువంటి పలు కారణాల ప్రభావం మాత్రం జుట్టు మీదే భారీగానే చూపెడుతోంది. వీటి నుండి తప్పించుకుని జుట్టును సంరక్షించుకునేందుకు వంటింటిని దాటి పోనక్కర్లేదు అంటున్నారు సౌందర్య నిపుణులు. వంటింట్లో లభించే పదార్థాలతోనే మృదువైన, ఆరోగ్యకరమైన, పట్టులాంటి జుట్టును సొంతం చేసుకునేందుకు కొన్ని చిట్కాలను కూడా చెప్తున్నారు వాళ్లు.

అవేంటంటే...

ఉల్లిరసం: ఉల్లిలో సల్ఫర్‌ పుష్కలంగా ఉంటుంది. త్వచాల్లో ఉండే కొల్లాజెన్‌ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సల్ఫర్‌ది ప్రధాన పాత్ర. అదే జుట్టు పెరగడంలోనూ కీలకం అన్నమాట. ఇందుకు ఏం చేయాలంటే... ఎరుపు రంగు ఉల్లిపాయలు లేదా సాంబారు ఉల్లిపాయల్ని చిన్నచిన్న ముక్కలుగా తరిగి రసం తీయాలి. ఆ రసాన్ని మాడు మీద రాసుకుని పావు గంట తరువాత మైల్డ్‌షాంపూతో కడిగేయాలి.

గుడ్డు మాస్క్‌: గుడ్డులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రొటీనే కాకుండా సల్ఫర్‌, జింక్‌, ఐరన్‌, సెలీనియం, ఫాస్పరస్‌, అయోడిన్‌లు కూడా ఉంటాయి ఇందులో. ఇవి జుట్టు ఎదుగుదలకి దోహదం చేస్తాయి. గుడ్డు తెల్లసొనలో ఒక టీస్పూను ఆలివ్‌ నూనె, తేనె వేసి బాగా కలిపితే మెత్తటి పేస్ట్‌లా అవుతుంది. జుట్టు అంతటా ఈ పేస్ట్‌ను పట్టించి 20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలి.

మెంతులు: మెంతులు జుట్టు పెరుగుదలలో సాయపడడమే కాకుండా జుట్టుకున్న సహజమైన రంగు పోకుండా కాపాడతాయి. ఒక టీస్పూను మెంతి గుజ్జులో రెండు టీస్పూన్ల కొబ్బరి పాలు పోసి కలపాలి. దీన్ని మాడు, జుట్టుకి పట్టించి అరగంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి.

బంగాళా దుంపల రసం: బంగాళా దుంప రసంలో జుట్టు పెంచే లక్షణాలున్నాయనే విషయం తక్కువ మందికి తెలుసు కావొచ్చు. కాని ఇందులో ఉండే విటమిన్‌ ఎ, బి, సిలు జుట్టుకి ఎంతో ముఖ్యం. ఒకవేళ జుట్టు పలుచబడే (అలోపేషియా) సమస్య ఉంటే బంగాళాదుపం రసం చాలా బాగా పనిచేస్తుంది. బంగాళాదుంపల రసాన్ని మాడుకి రాసుకుని పావుగంట తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.

హెన్నా ప్యాక్‌: హెన్నా సహజసిద్ధమైన కండీషనర్‌, వెంట్రుకల మూలాలకి బలాన్నిచ్చి జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ ప్యాక్‌ తయారీ ఎలాగంటే ఒక కప్పు హెన్నా పొడిలో అర కప్పు పెరుగు కలపాలి. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు హెన్నా మిశ్రమాన్ని పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.

గ్రీన్‌ టీ: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాచి. గోరువెచ్చటి గ్రీన్‌టీని మాడు మీద రాసుకుని గంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఉసిరి: ఇది యాంటీఆక్సిడెంట్ల భాండాగారం. విటమిన్‌-సి కూడా ఉంటుంది. ఉసిరి జుట్టును ఆరోగ్యకరంగా ఉంచడమే కాకుండా జుట్టు పిగ్మెంటేషన్‌ పాడు కాకుండా చూస్తుంది. అంటు జుట్టు రంగు మారకుండా ఉంటుందన్నమాట. రెండు టీస్పూన్ల ఉసిరిపొడి లేదా రసంలో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి మాడుకు రాసుకుని ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.

మిరియాలు: నల్ల మిరియాలు ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి. వీటిలో ఉండే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ మాడుకి తగిన తేమను అందిస్తాయి. రెండు టీస్పూన్ల న ల్ల మిరియాల్లో అర కప్పు నిమ్మరసం వేసి మెత్తటి గుజ్జులా మిక్సీలో పట్టాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లకు పట్టించి గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రభావం లోతుగా ఉంటుంది. అరగంట తరువాత తలస్నానం చేయాలి.