ఫ్యాట్‌ను తగ్గించే ఫుడ్స్...!
జీవనశైలిలో మార్పుల వల్ల, నిత్యం వ్యాయామం కొరవడటం వల్ల శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఫ్యాట్‌ను తగ్గించడానికి ఆరు రకాలైన సూపర్‌ఫుడ్స్ ఉన్నాయి.
శరీర లావునే కొవ్వు అని భావిస్తుంటాం. కానీ మన శరీరంలో మూడు రకాలైన ఫ్యాట్‌లు ఉన్నాయి. ఒకటి బాడీ ఫ్యాట్. రెండు బ్లడ్ ఫ్యాట్. మూడవది ఫుడ్ ఫ్యాట్. ఈ మూడింటికీ సన్నిహిత సంబంధం ఉంది. అయితే వీటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. బ్లడ్ ఫ్యాట్‌ని లిపిడ్స్ అంటాం. ఇవి రక్తంలో ట్రైగ్లిసరైడ్స్, కొలసా్ట్రల్ రూపంలో ఉంటాయి. కొలసా్ట్రల్ కాంపొనెంట్స్ కూడా శరీరానికి అవసరమే కానీ పరిమితికి మించి ఇవి ఉండకూడదు. ముఖ్యంగా లిపిడ్ ప్రొఫైల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో తేడాలు తలెత్తితే రకరకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఫుడ్ ఫ్యాట్స్ అంటే ఆయిల్స్, నెయ్యి, వెన్న, హైడ్రోజెనేటడ్ ఫ్యాట్స్ మొదలైనవి. ఇవి కొలసా్ట్రల్‌ను పెంచుతాయి.
శరీరాన్ని స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కొలసా్ట్రల్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఆరు సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది. ఊబకాయులు కారు. ఆరోగ్యంగా ఉంటారు. లిపిడ్స్ కూడా సాధారణస్థాయిలో ఉంటాయి.
గుడ్లు:
తెల్లసొనలో ప్రొటీన్లు బాగా ఉంటాయి. పచ్చసొనలో కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తెల్లసొన వల్ల మనలోని కొవ్వు సహజసిద్ధంగా కరుగుతుంది. గుడ్డు తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. ఉడకబెట్టిన తెల్లసొన, ఒక కప్పు పండ్లు, కూరగాయలు తింటే ఆ పూట భోజనం చేయాల్సిన పనిలేదు.
ఒమేగా 3 ఫుడ్స్:
ఇవి శరీరంలోని ఫ్యాట్‌ను , రక్తంలోని ఫ్యాట్‌ను నియంత్రిస్త్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. మకెరల్, ట్యూనా లాంటి చేపల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. వీటిని తింటే ఎంతో మంచిది. అలాగే అవిశలు, అవిశనూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఊబకాయం తగ్గించుకోవడానికి డైటింగ్ చేసేవాళ్లు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్‌ను సప్లిమెంట్ల రూపంలోగాని, ఆహారం రూపంలోగానీ తీసుకోవాలి.
పప్పుధాన్యాలు: వీటిల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు, విటమిన్లు, మినరల్స్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే సమతులాహారం తీసుకున్నట్టే. ఉదాహరణకు రాజ్మా, పెసలు, సెనగలు లాంటి వాటిని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి మర్నాడు ఉదయం వాటిని ఉడకబెట్టుకుని తింటే శరీరానికి ఎంతో మంచిది. పప్పులను ఉడకబెట్టి తినడం వల్ల కడుపులో గ్యాసు ఏర్పడదు. సులభంగా జీర్ణం అవుతాయి. పొట్టుతో సహా తింటే ఇంకా మంచిది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల బ్లడ్ షుగర్, బ్లడ్ ఫ్యాట్స్ పెరగవు. అంతేకాదు ఏదో ఒకటి తినాలనే యావ ఉండదు. ఒకప్పుడు ఉడకబెట్టిన పప్పుధాన్యాలు తింటే ఆకలి ఉండదు. అవి తింటే ఆ పూట ఇక అన్నం తినాల్సిన పని లేదు.
ఓట్స్:
ఓట్స్‌లో అత్యధికస్థాయిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది బ్లడ్ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఓట్స్‌కు నెయ్యి, నూనె, వెన్నలాంటివి జోడించి తింటే శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. అలాకాకుండా ఓట్స్‌లో కొన్ని కూరగాయముక్కలు లేదా పాలు పోసి బాగా ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో కొద్దిగా తేనె లేదా సాల్ట్ పెప్పర్ వేసుకుని కూడా తినొచ్చు. ఓట్స్ తింటే తొందరగా ఆకలి వేయదు.
బాదంపప్పులు:
బాదం పప్పులు క్రేవింగ్‌ను అరికడతాయి. వీటిల్లో ప్రొటీన్, ఎసెన్షియల్ ఫ్యాట్, పీచుపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఒక వ్యక్తి రోజుకు 45 బాదంపప్పులు తినొచ్చు. స్నాక్స్‌లా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇవి రక్తంలోని కొలసా్ట్రల్‌ను నియంత్రిస్తాయి. వీటిని తినడం వల్ల కొలసా్ట్రల్ పెరగదు.
పళ్లు, కూరగాయలు:
తక్కువ క్యాలరీలిచ్చే ఆహారం పళ్లు, కూరగాయలు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కూరగాయలను ఉడకబెట్టి తింటే బరువు బాగా తగ్గుతారు. తాజా పళ్లు తిన్నా కూడా బరువు తగ్గుతారు. సలాడ్‌లు కూడా మంచివే. వాటిల్లో రుచికోసం మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తినొచ్చు. సలాడ్‌లను స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. పళ్లు, కూరగాయల్లో సొల్యుబుల్, నాన్‌సొల్యుబుల్ పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి బ్లడ్ ఫ్యాట్ అంటే కొలసా్ట్రల్‌ని పెరగకుండా అరికడతాయి.

0 comments:
Post a Comment