బీట్‌రూట్ రసంతో బలమెంతో...!
రోజూ బీట్‌రూట్ జ్యూసు తాగితే అథ్లెట్లు తమ ఆటలో మంచి ప్రతిభను కనబరచ గలుగుతారట. ఇటీవల నిర్వహించిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది.
వ్యాయామాలు చేసేటప్పుడు బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్ శరీరంలోని కండరాలకు రక్త ప్రసరణ బాగా అయ్యేట్టు సహకరిస్తుందట. అంతేకాదు బీట్‌రూట్ జ్యూసు తాగడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రోగులు సైతం నాణ్యమైన జీవితాన్ని గడపగలుగుతారట. 100 గ్రాముల పాలకూరలో ఉండే నైట్రేట్ 70 మిల్లీలీటర్ బీట్‌రూట్ జ్యూసులో ఉంటుందట. వ్యాయామాలు చేసేటప్పుడు బీట్‌రూట్ రసం తాగడం వల్ల శరీరంలోని కండరాలకు జరిగే రక్తప్రసరణలో 38 శాతం పెరుగుతుందని కూడా ఈ పరిశోధనలో తేలింది.
మరికెందుకు ఆలస్యం... అథ్లెట్లు కావాలనుకునేవారు బీట్‌రూట్ రసాన్ని తాగడం మొదలెట్టండి మరి...!
0 comments:
Post a Comment