Pages

Saturday, 25 October 2014

Benefits of tomoto's టమోటా జ్యూస్‌ భేష్‌...!

టమోటా జ్యూస్‌ భేష్‌...!

టమోటాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలుసు. కాని టమోటా జ్యూస్‌ కూడా మెరుగైన ఆరోగ్యానికి దోహదపడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ జ్యూస్‌లో విటమిన్‌ ఎ, కె, బి 1, బి 2, బి 3, బి 5, బి 6 లతోపాటు ఐరన్‌, మినరల్స్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌లున్నాయి. ఇందులో ఉన్న మినరల్స్‌, విటమిన్‌లు ఆరోగ్యానికి బాగా తోడ్పడతాయంటున్నారు. తాజాగా ఉన్న టమోటాలతో చేసిన రసం చర్మంతోపాటు వెంట్రుకలకు మరింత మేలు చేస్తుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం, నీరు మనకు ఆరోగ్యాన్నిస్తుంది. దీనివల్ల ప్రొస్టేట్‌ కేన్సర్‌ ప్రమాదం ముప్పు తగ్గిస్తుందని నిపుణులు చెపుతున్నారు. ఈ జ్యూస్‌ జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి బాగా పనిచేస్తుంది. టమోటా రసం మన శరీరంలోని హై కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే ఈ జ్యూస్‌ డయాబెటిస్‌, ఆస్తమా, గుండె జబ్బులను సైతం తగ్గించేందుకు తోడ్పడుతుందని నిపుణులు తేల్చారు.

0 comments:

Post a Comment