Pages

Saturday, 25 October 2014

Benefits of Wallnets అల్జీమర్‌కు వాల్‌నట్స్‌..!




అల్జీమర్‌ జబ్బుకు చికిత్స లేదు. వాల్‌నట్స్‌ ఉన్న డైట్‌ తీసుకోవడం వల్ల ఈ జబ్బు రిస్కు కొంతవరకూ తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్‌కు చెందిన అధ్యయనకారులు చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వాల్‌నట్స్‌ని బాగా తినడం వల్ల పిల్లల్లో చదువు తెలివితేటలు పెరగడమే కాదు, యాంగ్జయిటీ సమస్య కూడా తగ్గుతుందట. జ్ఞాపకశక్తి బాగా మెరుగుపడుతుందట. ఈ అధ్యయనాన్ని ప్రాథమికంగా ఎలుకలపై చేశారు.

వాల్‌నట్స్‌లో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్ల వల్ల ఎలుక మెదడు పనితీరు క్షీణించలేదు. వాల్‌నట్స్‌కు, అల్జమీర్‌కు మధ్య ఉండే ప్రాథమిక సంబంధాన్ని ఈ పరిశోధన వెల్లడించింది. మెదడు ఆలోచనా సామర్థ్యంపై వాల్‌నట్స్‌ ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయని తేలింది. అంతేకాదు దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగడానికి ఈ పరిశోధన ఒక భూమికగా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

0 comments:

Post a Comment