శిరోజాలకు పోషకాహారం ..!
జుట్టు ఊడిపోతుంటే చాలామంది తెగ ఆందోళన పడిపోతుంటారు. కానీ మనం తినే ఆహారం బట్టి కూడా శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. పలచబడుతుంది. వెంట్రుకలు పొడిబారిపోతాయి. అంతేకాదు తెల్లబడతాయి కూడా. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా ఆ ప్రభావం శిరోజాల పెరుగుదల మీద, చర్మ ఆరోగ్యం మీద పడుతుంది. కాలుష్యం, పర్యావరణంలో మార్పులు సైతం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే నిత్యం పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజూ సమతులాహారం తీసుకోవడమే కాదు సమయానికి భోజనం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ శిరోజాల పెరుగుదల మీద ప్రభావం చూపుతాయి. అంతేకాదు మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆలస్యంగా పడుకోవడం లాంటి అలవాట్ల వల్ల శరీరంలోని వివిధ అంగాల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటితోపాటు శిరోజాల దృఢత్వం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే శరీర భాగాలకు పోషకాహారం ఎంత అవసరమో జుట్టు పెరుగుదలకు కూడా పౌష్టికాహారం అంతే అవసరం.
మనం తీసుకునే పోషకాహారం బట్టి శిరోజాల పెరుగుదల ఉంటుందని పోషకాహార
నిపుణులు సైతం చెప్తున్నారు. మనం తినే సమతులాహారం రకరకాల జబ్బుల బారిన
పడకుండా మనల్ని కాపాడడమే కాదు శిరోజాల్ని, చర్మాన్ని కూడా సంరక్షిస్తుంది.
అంతేకాదు ఇటీవల చిన్నా, పెద్దా అందరూ ఫాస్ట్‌ఫుడ్స్‌కు బాగా అలవాటుపడ్డారు.
దీంతో పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఎన్నో
విటమిన్లను, మినరల్స్‌ను, ఎంజైములను వాళ్లు కోల్పోతున్నారు. అలాగే బరువు
తగ్గాలని కొందరు తిండి సరిగా తినడంలేదు. ఇవన్నీ శరీరారోగ్యం మీద తద్వారా
శిరోజాలు, చర్మం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అందుకే సమ పాళ్లల్లో
పిండిపదార్థాలు, ప్రొటీన్లు, సప్లిమెంట్లు , ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
శిరోజాల పరిరక్షణలో ఐరన్ ప్రముఖపాత్ర వహిస్తుంది. ఆకుకూరల్లో ఇది బాగా
ఉంటుంది కాబట్టి వీటిని బాగా తినాలి.
తేనె, బ్లాక్ చెన్నా, పాలకూరలలో కూడా ఐరన్ బాగా ఉంటుంది. జుట్టు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్-ఇ, విటమిన్-బి, విటమిన్-సిలు అత్యావశ్యకాలు. జీడిపప్పులు, బాదంపప్పుల్లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. మామిడిపండు, పుచ్చకాయల్లో విటమిన్-బి బాగా ఉంటుంది. శిరోజాల పెరుగుదలకు ఇవి అవసరం. ఒకవేళ జుట్టు బాగా ఊడిపోతున్న పక్షంలో అత్యాధునికమైన హెయిర్ రెజ్యువనేషన్ ట్రీట్‌మెంట్ కూడా చేయించుకోవచ్చు. జుట్టు చిట్లిపోవడం సమస్యతో కొందరు బాధపడుతుంటారు. వీళ్లు అరటిపండు పేస్టు, కలబంద జెల్, కొబ్బరినూనెలను వాడితే మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యం సమతులాహారం తీసుకోవడం ద్వారా శిరోజాలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
సో....
మంచి ఫుడ్ తినండి... శరీరారోగ్యంతోపాటు శిరోజాల ఆరోగ్యమూ కాపాడుకోండి...!

0 comments:
Post a Comment