Pages

Sunday, 21 June 2015

నేరేడుపళ్లు చేసే మేలు.. !



నేరేడుపళ్లు చేసే మేలు.. !




నేరేడు పళ్లు నీలాల కళ్లు... అంటూ నేరేడు పళ్ల గురించి రాశాడో సినీకవిరేడు. నేరేడు పళ్లు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
* ఇంతకీ నేరేడు పళ్లు శరీరానికి చేసే మేళ్లు ఏంటంటే..
• నేరేడుపళ్లలో గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వ్యాధికి చక్కగా ఉపయోగపడతాయి. యాంటీ డయాబెటిక్‌ ఎఫెక్ట్స్‌ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది.
• కాల్షియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే వ్యాధి నిరోధకశక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది.
• హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి.
• ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు పళ్లు.
• గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకునే శక్తి నేరేడుకు ఉంది.
నేరేడు చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్‌ని తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి.
• నేరేడు పళ్లు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణసంబంధిత సమస్యలను తగ్గుతాయి.
• క్యాన్సర్‌ రాకుండా చేయడంలో నేరేడు పళ్లు ముఖ్యపాత్ర వహిస్తాయి.
• వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని తగ్గింగే గుణం ఈ పళ్లకు ఉంది.
• శరీరంలో వేడిని తగ్గించి.. తక్షణ శక్తిని ఇస్తాయి.

0 comments:

Post a Comment