Pages

Wednesday, 15 July 2015

For Beautiful Hair...Some changes in the food... అందమైన కురుల కోసం ... ఆహారంలో కొన్ని మార్పులు...!

అందమైన కురుల కోసం ... ఆహారంలో కొన్ని మార్పులు...!

 
 
 
జుత్తు పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్న ఒత్తుగా ఉండాలని కోరుకోని మహిళలు ఉండరు. పెరిగిపోతున్న కాలుష్యం, ఆధునిక జీవన శైలి కారణంగా అనేకమంది జుత్తు చిన్న వయసులోనే పల్చబడడమే కాదు రంగు కూడా మారిపోతున్నది. నెత్తి మీద దువ్వెన పెడితే తుట్టెలు తుట్టెలుగా వెంట్రుకలు ఊడొస్తుంటే బెంగపడిపోతుంటారు మహిళలు. అయితే ఊరికే బెంగపడకుండా తమ ఆహారపు అలవాట్లను ఒకసారి పరిశీలించుక...ోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆహారంలో కొన్ని మార్పులను చెప్తున్నారు.

• కారెట్లు...

విటమిన్‌ ఎ అధికంగా ఉండే కారెట్లను తీసుకోవడం వల్ల కేవలం కంటికే కాదు జుత్తకు కూడా మంచిదంటున్నారు నిపుణులు. మాడు ఆరోగ్యంగా ఉంటే నల్లగా మెరిసే, బలమైన జుత్తు పెరుగుతుందిట. ప్రోటీన్లు, పళ్ళు, కాయగూరలు, పప్పులు, చేపలు, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా జుత్తు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి.

• ఎండుద్రాక్షలు...

జుత్తు ఎండిపోయినట్టు గడ్డిలా ఉండి, పల్చబడిపోయి, రంగు వెలిసిపోయినట్టు ఉంటే లేదా తెగ ఊడిపోతుంటే అందుకు కారణం శరీరంలో ఐరన్‌ శాతం తగ్గిపోవడమే. ఎండు ద్రాక్షలలో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండడమే కాక జుత్తు క్వాలిటీ పెరిగేలా చేస్తుంది. దీనితో పాటుగా ఆకుకూరలు, బీట్‌రూట్‌లు కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

• పచ్చి బఠాణీలు...

పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉన్నా, నిర్దిష్టమైన విటమిన్‌ లేదా మినరల్స్‌ ఎక్కువగా లేకపోయినా వాటిలో విటమిన్లు, మినరల్స్‌, ఐరన్‌, జింక్‌, బి గ్రూప్‌ విటమిన్లు సమతులంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన జుత్తుకు మంచివి.

• ఓట్స్‌...

ఓట్లలో ఫైబర్‌ అధికంగా ఉం టుంది. ఇది గుండెకు సంబం ధించిన ఆరోగ్యాన్ని సంరక్షించి, విసర్జనను క్రమబద్ధం చేస్తుంది. ఫైబర్‌తో పాటుగా జింక్‌, ఐరన్‌, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. వీటన్నింఇనీ పాలి అన్‌ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్లని అంటారు. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి, జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది కేవలం ఆహారం ద్వారానే లభ్యమవుతుంది కనుక బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

• చిన్న రొయ్యలు...

చిన్న రొయ్యలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.ఇందులో ఉండే విటమిన్‌ బి12, ఐరన్‌, జింక్‌ జుత్తు ఊడిపోకుం డా కాపాడుతుంది. రెడ్‌ మీట్‌ను అతి గా తీసుకోవడం మాని అందుకు ప్రత్యామ్నాయంగా వీటిని ఎంచుకోవచ్చు.

• గుడ్లు...

ఒతైన నల్లని ఆరోగ్యవంతమైన జుత్తు కోసం కోడిగుడ్లను ఉంచుకోవడం మంచిది. ప్రోటీన్లు, విటమిన్‌ బి 12, ఐరన్‌, జింక్‌, ఒమేగా 6 ఆమ్లాలు అధికంగా ఉంటాయి. విటమిన్‌, మినరల్‌ లోపాలు ఉన్నప్పుడు జుత్తు ఆరోగ్యంగా కనుపించదు. గుడ్లలో ఉండే బయోటిన్‌ (విటమిన్‌ బి7) అనే పదార్ధం జుత్తు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.

కొవ్వు తక్కువ పాలు, పెరుగు...
కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పెరుగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనితో పాటుగా హైక్వాలిటీ ప్రోటీన్లైన వే, కేసిన్‌లు ఇందులో ఉంటాయి.

Monday, 13 July 2015

Benefits of Shikakai for Hair


Benefits of Shikakai for Hair

➺ With regular use of shikakai, you can have lustrous, thick, and healthy hair.

➺ It helps retain natural oil in the hair and scalp, and prevents hair loss. It helps strengthen hair roots.

➺ You won't need a conditioner if you are using this Ayurvedic powder to wash your hair. It acts as a detangler. Most conditioners eventually lead to hair loss.

➺ As it contains several natural herbs that exhibit antimicrobial properties, it helps to get rid of lice.

➺ It is used to combat dandruff. An infusion of shikakai leaves has been used in anti-dandruff preparations for centuries. It not only eliminates dandruff but prevents it too.

➺ It is packed with vitamins A, C, D, and K that are essential for hair health. It contains antioxidants too. All these nutrients help prevent diseases and promote rapid growth of hair.

➺ Shikakai bark is packed with saponins, which act as foaming and cleansing agents. Although it acts like a soap or shampoo, it is mild and natural, and so, does not cause serious side effects.

➺ Regular use of shikakai can help delay the appearance of gray hair.

➺ It protects the scalp from fungal infections.

➺ If you start using shikakai, you will notice increased silkiness and bounciness of hair within a couple of months.

➺ Those who color their hair will find that cleaner and healthier hair can give better color result.

➺ As it prevents hair loss and strengthens hair roots, it provides volume to your hair within a few months.

Egg white and Yogurt Hair pack for Thinning hair and Hair Fall




Egg white and Yogurt Hair pack for Thinning hair and Hair Fall

Mix one egg white with a cup of yogurt. Separate hair strands part by part, apply the mask all over your scalp & hair.Keep the mask for 30 to 40 minutes & then wash off by a herbal shampoo.

Improve of Eye Vision.కంటిచూపును మెరుగుపరిచే ఖర్జూరం









* కంటిచూపును మెరుగుపరిచే ఖర్జూరం..!!
 
నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎంతో తియ్యని ఖర్జూరాన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా, ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ కనీసం ఒక్కటైనా తీసుకోగలిగితే ఎన్నో సహజ పోషకాలను సులువుగా పొందవచ్చంటున్నారు.ముఖ్యంగా ఖర్జూరాల్లో క్యాల్షియం, సల్ఫర్‌, ఇనుము, పొటాషియం , ఫాస్పరస్‌, మ్యాంగనీస్‌, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు సమౄఎద్ధిగా లభిస్తాయి. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ను నివారించే శక్తి కూడా వీటికి ఎక్కువగా ఉంది. అలాగే ఇందులోని విటమిన్‌ ’ఎ’ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఊపిరితి త్తులు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇనుము వల్ల రక్తహీనత సమస్య అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

Shine Hair మెరిసే జుట్టు సొంతమిలా... !







మెరిసే జుట్టు సొంతమిలా... !
జుట్టు మెరుస్తూ ఉండడానికి మార్కెట్‌లో దొరికే కండిషనర్స్‌కి బదులుగా.. మనకు ఇంట్లో కనిపించే కొన్ని పదార్థాలనూ వాడొచ్చు.
ఇవి ప్రయత్నించండి..
• వెంట్రుకల్లోని తేమని నిలిపి ఉంచడంలో కొబ్బరినూనె ఎంతో సాయపడుతుంది. గోరువెచ్చని కొబ్బరినూనెని తల, మాడుకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఇది మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
• పెరుగులోని పోషకాలు జుట్టు మెరిసేందుకు సాయపడతాయి. పెరగూ, అరటి పండు ముక్కలను బాగా చిదిమి దానికి అరచెంచా బాదం నూనె కలిపి స్నానం చేయాలి.
• తేనె కూడా జుట్టుకు మెరుపు తీసుకొస్తుంది. రెండు చెంచాల తేనెని రెండు కప్పుల వేడి నీళ్లలో కలపాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి షాంపూ చేసిన తర్వాత జుట్టుపై స్ప్రే చేయాలి. ఐదు నిమిషాలపాటు వేళ్లతో మసాజ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.