Pages

Monday, 13 July 2015

Shine Hair మెరిసే జుట్టు సొంతమిలా... !







మెరిసే జుట్టు సొంతమిలా... !
జుట్టు మెరుస్తూ ఉండడానికి మార్కెట్‌లో దొరికే కండిషనర్స్‌కి బదులుగా.. మనకు ఇంట్లో కనిపించే కొన్ని పదార్థాలనూ వాడొచ్చు.
ఇవి ప్రయత్నించండి..
• వెంట్రుకల్లోని తేమని నిలిపి ఉంచడంలో కొబ్బరినూనె ఎంతో సాయపడుతుంది. గోరువెచ్చని కొబ్బరినూనెని తల, మాడుకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఇది మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
• పెరుగులోని పోషకాలు జుట్టు మెరిసేందుకు సాయపడతాయి. పెరగూ, అరటి పండు ముక్కలను బాగా చిదిమి దానికి అరచెంచా బాదం నూనె కలిపి స్నానం చేయాలి.
• తేనె కూడా జుట్టుకు మెరుపు తీసుకొస్తుంది. రెండు చెంచాల తేనెని రెండు కప్పుల వేడి నీళ్లలో కలపాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి షాంపూ చేసిన తర్వాత జుట్టుపై స్ప్రే చేయాలి. ఐదు నిమిషాలపాటు వేళ్లతో మసాజ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

0 comments:

Post a Comment