సౌందర్య పోషణలో
కొబ్బరి బోండాలు
వేసవి కాలంలో దాహార్తిని తీర్చే కొబ్బరి బోండాలు సౌందర్య పోషణలోను బాగా పనిచేస్తాయి.
చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరి బోండాం నీళ్లలో మెండుగా ఉంది. అందుకని వేసవిలో ప్రతిరోజూ కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
* ముదురు కొబ్బరి నుంచి తీసిన పాలతో చర్మానికి మర్దనా చేసి ఆరిన తరువాత కడిగేస్తే చర్మం సున్నితంగా కోమలంగా తయారవుతుంది.
* ఒక కప్పు కొబ్బరి పాలల్లో కొద్దిగా అరటిపండు గుజ్జు, ముల్తాని మట్టి, గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. కొంచెంసేపటి తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరవడమే కాకుండా వేడి తగ్గి తల చల్లగా ఉంటుంది.
0 comments:
Post a Comment