Pages

Sunday, 14 December 2014

What are the benifits of palakura పాలకూర

పాలకూర తాజాగానే... !

శరీరానికి ఫోలేట్ ఎంతో అవసరం అన్నది తెలిసిందే. అయితే ఇటీవల డచ్ పరిశోధకులు దీనిమీద మరింత దృష్టి పెట్టి పరిశోధనలు చేయగా అది జ్ఞాపకశక్తిని పెంచుతుందని తేలింది. రోజూ 800 మైక్రో గ్రాముల ఫోలిక్ ఆమ్లాన్ని వరసగా మూడేళ్లపాటు తీసుకోవడంవల్ల వయసుతోపాటు వచ్చే మతిమరుపు రాకుండా జ్ఞాపకశక్తి పెరుగుౖతుందట. ఎందుకంటే ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల మెదడులోని హిప్పోక్యాంపస్ పనితీరు దెబ్బతింటుంది. అందుకే ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండే లేత తోటకూర, లేత పాలకూరలను తాజాగానే తినాలంటున్నారు. అదెలా అంటే ఉడికించిన నూడుల్స్ లేదా అన్నం, పాస్టా... వంటి వాటిని ఈ తాజా ఆకులమీద వేస్తే ఆ వేడికి అవి కాస్త మెత్తబడి తినడానికి అనుకూలంగా ఉంటాయి. ఇలా రోజూ గుప్పెడు ఆకుల్ని తినడంవల్ల రోజువారీ అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లంలో 15 శాతం లభిస్తుందట.

Monday, 24 November 2014

How to use Aloe vera shampoo for oily Hair.


Aloe vera shampoo for oily Hair

You can create your own shampoo by mixing a cup of any mild shampoo with 1 tsp aloe vera gel and 1 tbsp lemon juice. You can store this upto a week in the fridge. This is one of the best home remedies for oily hair.

5 Common Benefits Of Lemon Juice for Your Hair



5 Common Benefits Of Lemon Juice for Your Hair


1. Lemon Juice Aids Shine To Your Hair
Lemon juice can work great to make your hair shinny. Simply rinse your hair with lemon juice diluted with water. This will be a natural acidic rinse that will help you achieve a shiny look. Another way to do the same is by mixing equal amounts of lemon juice and your favorite conditioner. Apply the mixture on your hair for one to two minutes and then wash off.
2. Lemon Juice Aids To Hair Growth
Lemon juice is very effective to increase the length and strength of the hair. If you massage the scalp with the mixture of lemon juice and coconut oil or olive oil, you will notice the stimulation in the hair follicles which will ultimately result in the improved hair growth. Lemon juice also serves as an effective hair loss remedy and the vitamin C in the lemon juice helps to strengthen hair roots.
3. It Helps To Reduce Dandruff
One of the common hair problem faced by people is Dandruff which is also quite embarrassingfor men. There are many ways in which you can use lemon juice to get rid of that condition. Mix 1 tbsp of fresh lemon juice in about 3 tbsp of water, 1 tbsp of vinegar and 1/4 tbsp of salt. Apply the mixture onto the scalp and leave for about 30 minutes. Then rinse with warm water and clean the hair with regular shampoo. Few such repeated applications will help to remove dandruff easily.
4. Lemon Juice Deals With An Oily Scalp And Oily Hair
A lemon juice rinse also helps to control the oil and thus deals with oily hair and oily scalp quite effectively. The nutrients present in the lemon juice like citric acid helps to remove the excessive oil and prevent the formation of oil buildup. A mixture of lemon juice and vinegar inequal amounts aids in the removal of clogged follicles that give rise to an oily scalp.
5. Lemon Juice Helps To Get Rid Of Lice
You can get rid of lice by the use lemon juice on your hair. For this, mix the lemon juice with the paste of garlic and apply onto the hair leaving for 30 minutes. Rinse it then and clean with the regular shampoo.
Lemon juice is an important ingredient in various herbal and homemade formulations for maintaining the beauty of hair. However, every remedy is effective if used in the right amount, and so is the case with lemon juice. An excessive use of lemon juice may result in an extremely dry scalp and weaken the hair roots, hence you have to be very careful when using Lemon juice on your Hair.

Milk & Honey Hair pack for Hair loss, Dandruff, Lice, Split ends and Hair Growth



Milk & Honey Hair pack for Hair loss, Dandruff, Lice, Split ends and Hair Growth

Take some heated milk and put some Honey into it. The amount of milk and Honey should be according to your hair density and volume in 3;1 Ratio so that it can properly cover your Entire hair. Mix the heated milk and honey thoroughly so that you get a uniform mixture of both.

Now apply the mixture properly on your Entire length of hair and then cover your head with the Shower cap or Hot towel leaving it for about two hours.

The heat generated due to the Hot mixture and hot towel will work wonders to kill the dandruff and stimulate hair follicles for the Proper hair growth. It will also remove dead hair cells and split ends. Dandruff is one of the main cause of hair fall and if your hair loss is due to Dandruff then your problem will get resolved after some applications

Note: The milk should not be too hot. It should be warm enough so that you can easily apply on your head without any difficulty.

Seven Foods For Healthy Hair Growth



Hair loss is not uncommon for men but did you know that it can also affect women? Genetics plays a major role in male baldness but hormonal imbalances, underactive thyroid, nutritional deficiencies and stress are more common causes of hair loss in women.
If you want to counter hair loss you there are a number of vitamin supplements available which provide your hair with the nutrients it requires for growth.
Here are 7 healthy foods packed full of nutrients your hair will love.
1. Oily Fish, Nuts and Avocados
The key hair is essential fatty acids which are not only critical to your overall health and wellbeing but also to the health of your hair. It will help your hair shine with health.
2. Citrus Fruit, Kiwi Fruit and Strawberries
What do these three fruits have in common? They are packed with vitamin C. Vitamin C helps in the production of collagen, and collagens is what surrounds and protects the hair shaft. If collagen breaks down hair is more likely to break, so increase collagen by increasing your vitamin C intake. Collagen also plays a vital role in the reduction of wrinkles so it's a win for your whole body.
3. Nuts, Brown Rice and Oats
These three foods include a form of vitamin B called Biotin. Biotin is key in hair growth and the circulation of nutrients around your scalp and hair follicles.
4 Red Meat, Dark Green Leafy Veges, Berries and Cashews
Iron is essential for hair growth so it is critical that you get enough. Women often suffer from iron deficiency which is just going to add to hair loss issues. If you are not getting enough iron in your diet then take a good supplement. Vitamin C is key to iron absorption so keep up the fresh fruit and vege too.
5. Cucumber, Mango, Asparagus
These foods are rich in silica which also play a major role in hair growth. If you really want to grow your hair fast then take a 500mg silica supplement twice daily.
6. Oysters, Brazil Nuts and Eggs
These are foods that are high in zinc. Zinc is essential for hair and nail strength. If you really think your hair and nails need a health boost you might want to consider taking zinc supplements, or even a zinc and silica supplement.
7. Sunflower Seeds, Almonds Pine nuts and Dried Apricots
These are all foods that are high in Vitamin E which is essential in the manufacture of Keratin. Keratin protects and strengthens hair. Increasing your vitamin E intake will help prevent breakage and further damage.
Finally, try to reduce your levels of stress this will help immensely to reduce the levels of hair loss.

How to get rid of Lice?


How to get rid of Lice?

The best way to get rid of the lice and the nits is combing. Fine-toothed combs, specially designed for lice removal, are also available in the market. This process needs patience on the part of both the parents and the children. Make sections of the hair and clip them with pins or clips. Then comb the hair slowly, trapping the lice and the nits into the teeth of the comb.You may use your nails to kill the lice and smash the eggs. Then clean the teeth and repeat the process again with different sections of hair. Remember to wash the comb in warm, soapy water for at least 15 minutes after the entire session.

Repeat this process after 7-10 days. Do this for at least 3-4 times to make sure the lice have disappeared completely.

What to do for thicker Hair




In order to Get Thicker Hair

Massage your hair with oil once a week before washing. Take a tablespoon each of coconut and olive oil and heat the mixture. Apply this mixture on your hair and scalp. Using your fingertips, massage your scalp slowly. After this, take a towel, dip it in hot water, and then wring it to remove the excess water. Wrap your head in this wet towel and steam your hair for half an hour. Afterwards, shampoo the hair as usual. This hot oil therapy stimulates the blood circulating on the scalp, thus making your hair strong and thick.

What are the Vitamins That Prevent Hair Thinning



4 Vitamins That Prevent Hair Thinning 

Vitamin B 
When it comes to hair health, all the Vitamins of family B are beneficial, but the main ones are B3, B7, and B12. Apart from making the hair strong, most of the B vitamins enhance the sheen, thickness, and color of the strands. While biotin fights premature graying; niacin or vitamin B3 improves blood circulation in the scalp, thereby promoting hair growth. B vitamins are abundant in legumes, whole grains, meat, poultry, bananas, potatoes, milk, eggs, etc.

Vitamin C
Vitamin C is responsible for developing collagen and maintaining its level in the body. Collagen is the main structural protein in connective tissues, and it strengthens hair. Apart from that, vitamin C is vital for absorption of iron, which is essential for hair growth.

Vitamin D
They actively involved in anagen initiation of the cycle. Absence of vitamin D receptors has been linked to alopecia. Another study shows that women who experience hair thinning has low levels of vitamin D and iron. Egg yolks, salmon, tuna, mackerel, cheese, powdered milk, etc. has considerable amounts of vitamin D.

Vitamin E
Being a good antioxidant, vitamin E enhances overall health and slows down the process of aging. Thus this vitamin is beneficial for delaying hair graying. Almonds, kiwi fruit, papaya, avocado, spinach, collards, and kale are rich in vitamin E

Lemon and Onion Hair Mask For Hair loss


Lemon and Onion Hair Mask For Hair loss

Make a paste of onions and add fresh lemon juice to it. Apply this paste on the scalp. Leave it on for half and hour. You can then wash this off with a herbal and mid shampoo.

7 Tips To Grow Thiker And Longer Hair



7 Tips To Grow Thiker And Longer Hair



Every man and woman want beautiful, thicker and shiny hair, but those people are very lucky who get the right information and follow it strictly and their hair becomes as beautiful and thicker as they desire. To make your hair beautiful and thicker, it is not necessary that you have to go to expensive saloons, buy costly hair care products or follow any other hair care treatments that require lots of your hard earned money and precious time. In fact, using too many chemical based products or passing your hair through any scientific procedure make it even worst, giving only temporary results and glory to your hair. Keeping all those things in mind, one should look for natural methods which are safe, affordable and easily doable even at the comfort of your home. bellow are some methods that are natural and affordable for solving all kinds of hair problems.
1. Massage Your Head At Least Once In A Week
Massaging your head weekly with the naturally occurring oils does a very good job in strengthening your hair in the long run. Natural oils like olive oil, coconut oil, almond oil and others herbal oils like horsetail herb for hair growth are very rich sources of minerals and vitamins which are very necessary in the nourishment and formation of the hair.
Massage not only help with hair problems, but it also helps in solving many scalp diseases. Massage help to regulate the blood flow of scalp and make it stronger for healthy hair growth.
2. Use Shampoos And Conditioners Regularly To Keep Your Clean
If your hair remains unclean and full of dirt, it will surely break, get thin and fall off in the end. In order to keep your hair safe, it is very necessary that you may wash it regularly to keep it neat and clean. It would be even better if you use shampoos and conditioners for this purpose. Use shampoos and conditioners which are based on natural herbs. Avoid those containing excessive amount chemicals.
3. Brush Your Hair Properly And Keep Timing It Regularly
Brushing your hair in proper way is as important as any other hair care treatment. Do not comb the hair when its still wet. Doing so makes the hair root weak. Let it get dry first naturally. Avoid using hair dryer to save time. The brush or comb should have wide teeth.
You should also trim your hair on regular basis to remove its split ends. Long hair get splits at the ends and it can split the whole length of hair if not cut at the right time.
4. Use Home Made Masks
Probably you might have heard about the home remedies for hair. Home made masks are the types of hair growth remedies which if used regularly can be very beneficial for the growth and beauty of your hair.
Such masks can be made at home easily from the common kitchen items and applied on the hair for some time. One of the common homemade hair masks is mad as follows.
“ Mix two egg yolks with a tablespoon of olive oil and honey each. Apply the mixture on you hair for about 30 minutes and then rinse it off. Repeating the application once in a week can do miracles for your hair.”
5. Avoid The Use Of Chemicals On Your Hair
Applying herbal oils on your hair is beneficial, but the use of chemical based products is harmful. Usually the products we use to make our hair look beautiful like dying and straightening contain harmful chemicals. It would be better if you stop or minimize the use of such products. Instead use natural oils.
6. Live Stress Free
Stress will have a very negative impact on your over all health. It does same with your hair too. Stress causes hormonal imbalance and affect blood circulation in the body, which in turn lowerthe performance of body organs. Worrying and getting extra stress does not solve any of our life problem, so always try to be optimistic Don’t worry about the things that are not in your hands. Avoid people and things which always lower your self steem and confidence, instead surround yourself with positive people who keep you motivated and encourage you to face new challenges.
7. Follow Right Diet Routine
Last but not the least tip is to eat right foods to grow your hair thicker. Hair is made up of protein, vitamins and other minerals, so eating foods containing those elements will greatly benefit your hair. Keep eating vegetables and fruits regularly. They are rich source of vitamins and proteins like B-complex, biotin and keratin.. Adopting healthy diet will have a positiveeffect on your general health too.

Tuesday, 18 November 2014

Daily apple a day keep the doctor away ఆరోగ్యానికి ఆనందం.. యాపిల్‌



ఆరోగ్యానికి ఆనందం.. యాపిల్‌ 



రోజూ ఓ యాపిల్‌ తింటే డాక్టర్‌తో పనిలేదు. ఉప్మా, ఇడ్లీ, పూరీ, వడ, చపాతీ, పిజ్జా, బర్గర్‌, బిర్యానీ... ఇవి తిని ఆరోగ్యానికి తూట్లు పొడుచుకునే బదులు రోజూ ఓ యాపిల్‌ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో ఆలోచించండి. ముందు మనం చెప్పుకున్న ఆహార పదార్థాల కంటే యాపిల్‌ ఖరీదు ఎక్కువేం కాదు. ఆరోగ్యానికి హాని చేసే చెత్త తిండి, ఆయిల్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినేకంటే రోజుకొక్క యాపిల్‌ తింటే ఎంతో ఉపయోగం. మంచి శక్తినిచ్చే ఆహారం యాపిల్‌. నీరసంగా ఉన్నప్పుడు, బాగా కష్టపడి పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క యాపిల్‌ తింటే చాలు.. తెలీకుండానే ఉల్లాసం వచ్చేస్తుంది. యాపిల్‌ తినడం వల్ల దంతాలపై గార తొలగిపోయి తళతళలాడతాయి. ఇందులో ఉన్న విటమిన్‌ సి శరీరంలోని ఇమ్యూనిటీని పెంచుతుంది. అధిక బరువును అరికడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రోజూ యాపిల్‌ తింటే బ్లెడ్‌ షుగర్‌, డయాబిటీస్‌, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందీ యాపిల్‌.

The power of pudena పుదీనాతో ఆరోగ్యం పదిలం...!




పుదీనాతో ఆరోగ్యం పదిలం...!




- చర్మ వ్యాధులున్నవారు పుదీనా రసంతో చర్మాన్ని రుద్దితే సత్పలితాలను పొందొచ్చు. 

- రోజూ ఐదారు పుదీనా ఆకుల్ని నమిలి మింగితే నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియా నశిస్తుంది. చిగుళ్ల వ్యాధులు దరి చేరవు. ఒకవేళ ఉంటే క్రమంగా నెమ్మదిస్తాయి.

- దంత క్షయం తగ్గుతుంది.

- పుదీనా ఆకులు తింటే గొంతు నొప్పి, దగ్గుల నుండి ఉపశమనం లభిస్తుంది.

- నీళ్ళ విరోచనాలు ఉన్నవారు పావు కప్పు పుదీనా రసంలో ఒక స్పూన్‌ తేనె వేసుకుని ఉదయం, సాయంత్రం తాగితే విరోచనాలు తగ్గుముఖం పడతాయి.

- పుదీనా రసంలో నిమ్మరసం, తేనె కలిపి రోజూ తీసుకుంటే జీర్ణసంబంధమైన అనేక ఇబ్బందులు అదుపులోకి వస్తాయి.

How to reduce the fat in the boby బరువు తగ్గండిలా...!




బరువు తగ్గండిలా...!

అధిక బరువు ఉన్నవారు రోజూ ఉదయం వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారు. గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం సక్రమంగా పచనమవడానికి అవసరమైన జీర్ణరసాలను కాలేయం ఉత్పత్తి చేయడంలో ఈ రసం దివ్యౌషధంగా పని చేస్తుంది. జీర్ణవాహికలో కదలికలు సరిగ్గా జరగడానికి, కడుపు ఉబ్బరం తగ్గడానికి కూడా తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది.

Risks of smoking ప్రాణాంతకం!


ప్రాణాంతకం!

మీకు సిగరెట్‌ తాగే అలవాటుందా? అయితే కచ్చితంగా మీరు అల్పాయుష్కులేగాక వ్యాధిగ్రస్తులు కూడా. ఎందుకంటే సిగరెట్‌, బీడీ, చుట్టా ఏది పీల్చే అలవాటున్నా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. శ్వాస కోశ, క్యాన్సర్‌, సిఒపిడి వంటి వ్యాధులు పొగపీల్చేవారిని వెంటాడుతూనే ఉంటాయి. వీటిలో ఏదోఒక వ్యాధి పొగరాయళ్లను కచ్చితంగా వేధిస్తుంది. అందుకే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని, పొగపీల్చే అలవాటును దూరం చేసుకోవాలి. సిగరెట్లు తాగేవారిలో చాపకింద నీరులా ఎక్కువమందిని వెంటాడుతున్న ఊపిరితిత్తుల వ్యాధుల్లో సిఒపిడి (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) ఒకటి. ఈ వ్యాధివల్ల ఊపిరితిత్తులు పాడైపోయి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

సిఒపిడిని ఒకప్పుడు క్రానిక్‌ బ్రాంకైటిస్‌, ఎంఫిసిమా అని రెండు వ్యాధులుగా పరిగణించేవారు. కానీ ఇప్పుడీ రెండింటినీ కలిపి కేవలం సిఒపిడిగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. వీటిలో క్రానిక్‌ బ్రాంకైటిస్‌లో కళ్లె ఎక్కువగా పడుతుంది. ఎంఫిసిమాలో ఆయాసం అధికంగా ఉంటుంది. అయితే ఈ రెండింటికీ కారణం ధూమపానమే. సిగరెట్‌, చుట్టా, బీడీ ఇవన్నీ సిఒపిడి వ్యాధిని కలిగించేవే. ఊపిరితిత్తుల వ్యాధి పురుషులకే కాదు, పొగపీల్చే అలవాటున్న మహిళలకూ వస్తుంది. ఆస్తమా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధే అయినా సామాన్యంగా ఏదోఒక సీజన్లో వస్తూ, పోతూ ఉంటుంది. కానీ సిఒపిడి అలా కాదు. వచ్చిందంటే పోదు. క్రమంగా ముదురుతూ ఉంటుంది. దీనివల్ల ఆయాసమే కాదు, కనీసం మూత్ర విసర్జనకు కూడా లేచి నాలుగు అడుగులు వేయలేని దుస్థితి వస్తుంది. తరచూ దగ్గు, జ్వరం, కళ్లె (తెమ్డా) సమస్యలు ఉంటాయి. కొందరు బరువు తగ్గుతారు. ఎంత తిన్నా పరిస్థితి అలాగే ఉంటుంది. ఆశ్చర్యం అనిపించినా తిన్నదంతా ఊపిరిపీల్చుకోవడానికే సరిపోతుందనేది వాస్తవం. ఇక శరీరానికి శక్తి ఎలా లభిస్తుంది? ధూమపానం చేసే వ్యక్తి తన జీవితంలో సిగరెట్లు, బీడీలకే తన సంపాదనలో 15 శాతం ఖర్చు చేస్తుండగా, వాటి ప్రభావంతో వ్యాధిబారిన పడిన తర్వాత తగ్గించుకునేందుకు 30 శాతం ఖర్చు చేస్తున్నారని ఆరోగ్య నిపుణుల అంచనా.

కారణాలు

క్రానిక్‌ బ్రాంకైటిస్‌ సిగరెట్లు, బీడీలు తాగేవారిలో కనిపిస్తుంది. ఏళ్లతరబడి ధూమపానం చేసేవారు కచ్చితంగా ఈ వ్యాధిబారిన పడతారు. పరోక్ష ధూమపానంవల్ల, అంటే ఒకరు సిగరెట్‌ పొగపీల్చి వదలడంవల్ల, ఆ పొగ పీల్చిన ఇతరులకు కూడా క్రానిక్‌ బ్రాంకైంటిస్‌ రావచ్చు. వాతావరణ కాలుష్యంవల్ల, వడ్రంగిపనివల్ల, మైనింగ్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో పనివల్ల సిఒపిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కట్టెలపొయ్యిమీద వంటచేసేవారు నిరంతరం పొగలో ఉండటంవల్ల ఈ వ్యాధి రావచ్చు. వాహనాలు నడిచేటప్పుడు విడుదలయ్యే పొగను పీల్చడంవల్ల కూడా వస్తుంది.

లక్షణాలు

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. రోజువారీ పనులు సరిగ్గా చేసుకోలేరు. వ్యాధి ముదిరేకొద్దీ శరీరం నిస్సత్తువగా మారిపోతుంది. కదలికలు తగ్గిపోతాయి. కిటికీలు లేని గదిలోకి వెళ్లినా, బాత్‌రూమ్‌లో ఉన్నా, కాస్త వంగున్నా, జలుబు చేసినా ఊపిరి తీయడం కష్టంగా మారుతుంది. ఆకలీ, బరువూ తగ్గుతాయి. కళ్లు తిరుగుతాయి.

ఎలా గుర్తించాలి?

ఎంతకీ మానని దగ్గు, కాస్త రంగుగా కళ్లె పడుతున్నప్పుడు సిఒపిడి ఉందేమో పరీక్ష చేయించుకోవడం మేలు. సిఒపిడి, ఎంఫిసిమా, ఇతర ఊపిరి తిత్తుల వ్యాధులను కచ్చితంగా డాక్టర్లు మాత్రమే నిర్ధారించగలుగుతారు. పల్మనరీ ఫంక్షన్‌ టెస్టు ద్వారా ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయనేది తెలుసుకోవచ్చు. కళ్లె పరీక్షలు, ఎక్స్‌రేలు కూడా ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటిస్కాన్‌ చేయించుకుంటే బుల్లాలను (ధూమపానంవల్ల ఊపిరితిత్తుల్లో పాడైపోయిన చిన్న చిన్న వాయుకోశాలు కలిసిపోయి పెద్ద తిత్తిలా మరుతాయి. పాడైపోయిన ఈ తిత్తి శ్వాస ప్రక్రియ సరిగ్గా నిర్వహించదు. దీనినే బుల్లా అని వ్యవహరిస్తారు) గుర్తించే వీలుంటుంది.

చికిత్స

పొగపీల్చడం తక్షణమే మానేయాలి. లేదంటే వ్యాధి మరింత ముదురుతుంది. ఇన్‌హేలర్‌ ద్వారా మందులు వాడితే ఊపిరితిత్తుల్లో శ్వాస నాళాలు కాస్త వదులుగా మారి శ్వాస తేలిగ్గా అందుతుంది. పరిస్థితినిబట్టి ఆక్సిజన్‌ అందించాల్సి వస్తుంది. సిగరెట్లు తాగడంవల్ల ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు, వ్యాధి ముదిరి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఆపరేషన్‌ చేయాల్సి రావచ్చు. దీనినే లంగ్‌ రీడక్షన్‌ సర్జరీ అంటారు. అంటే ఊపిరితిత్తుల్లోని బుల్లాలను తొలగిస్తారు. 

Benifits of Kiwi fruits పోషకాల గని...కివి!



పోషకాల గని...కివి!


ప్రకృతిలో మనకు లభించే 27రకాల పండ్లలో అతి ఎక్కువ పోషకాలున్న ఫలం కివి. అందుకే ఈ పండును వండర్‌ ప్రూట్‌ అం టారు. దీనిని చైనీస్‌ గూస్బెర్రీస్‌గా పిలుస్తారు. న్యూజిలాం డ్‌, చిలీ, ఫ్రాన్స్‌, ఇటలీ, అమెరికా వంటి చల్లని దేశాల్లో ఎక్కువగా పండే కివి పండ్లను మన దేశంలోనూ హిమాచల్‌ప్రదేశ్‌లో పండిస్తున్నారు. ఇందులో ఆరెంజ్‌ పళ్లకు రెంట్టిపు శాతంలో విటమిన్‌ సి, ఆపిల్‌ కన్నా ఐదు రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. శరీర పోషణకు కావల్సిన విటమిన్‌ ఇ, పోటాషియం,ఫోలిక్‌ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటీనాయిడ్స్‌ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు తక్కువగా , ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులున్న వారు కూడా నిశ్చింతగా ఈ పండ్లను తమ మెనూలో చేర్చుకోవచ్చు.

విటమిన్లు.. ప్లావనాయిడ్స్‌, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండే కివి పళ్లను ఎక్కువగా తింటే కంటి సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు.

అధిక బరువు తగ్గాలనుకునే వారు కివి పండు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

పెరిగే వయస్సుతో పాటు వచ్చే కణాల క్షీణత ఈ పండు తినడం వల్ల 36శాతం వరకు తగ్గుతుందని పరిశోధనల్లో స్పష్టమైంది.

క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు మార్పులను అరికట్టే పదార్థాలు కివిలో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో లభించే గ్లుటథియోన్‌ క్యాన్సర్‌ కు దారితీసే పరిస్థితులను నివారిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్‌, లుటెయిన్‌ ప్రోస్టేట్‌ గ్రంధి, కాలేయ క్యాన్సర్‌లను నివారిస్తాయి.

ఇందులో సమృద్ధిగా లభించే అమినోయాసిడ్‌ ఆర్జినిన్‌ రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఆర్జినిన్‌, గ్లుటామిన్‌ అనే రెండు అమినోయాసిడ్స్‌ ఎక్కువగా ఉండి.. గుండెకు రక్తప్రసరణం బాగా జరిగెందుకు దోహద పడుతాయి.

కివిలో ఉండే ఇనోసిటాల్‌ అనే పదార్థం మానసికవ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అధికంగా ఉండే బీటా కెరోటిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగ పడుతుంది. ఎక్కువగా ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

How to give rest to Heart and Lungs గుండె, ఊపిరితిత్తులు ఎలా విశ్రాంతి తీసుకుంటాయి ?




గుండె, ఊపిరితిత్తులు ఎలా విశ్రాంతి తీసుకుంటాయి ? 


గుండె, ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకోవడమంటే, ఏకంగా పైకి వెళ్ళిపోవటమే అనుకుంటారంతా. అది పొరబాటు. శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు కూడా ప్రతిరోజు కొన్ని గంటలపాటు విశ్రాంతి తీసుకునేట్లు తయారుచేయబడ్డాయి. కానీ మన ఆహార, విహారాదులు ఆ విశ్రాంతిని వాటి కి దూరం చేస్తున్నాయి.

గుండె, ఊపిరితిత్తులు సవ్యంగా పనిచేస్తే మానవుడు ఎంతో శక్తివంతంగా, ఎక్కువకాలం జీవించవచ్చు. వాటి ఆరోగ్యానికి, పెందలాడే చేసే భోజనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఆహారాన్ని తింటే దానిని అరిగించుకోవడానికి జీర్ణకోశానికి ఎక్కువ రక్తాన్ని, ప్రాణవాయువు అందించడానికి గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ పని చేయాలి. మనం పగలు తినడంతో పాటు తిరుగుతూ ఉంటాము కాబట్టి కండరాలకు కూడా ఎక్కువ రక్తాన్ని, ప్రాణవాయువు అందించడానికి గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది.
మనం పగలు తినడం, తిరగడం అనే రెండు పనులు చేసినంత సేపు గుండె నిమిషానికి 72 సార్లు అంతకంటే ఎక్కువ కొట్టుకుంటే, ఊపిరితిత్తులు నిమిషానికి 18 సార్లు అంతకంటే ఎక్కువ కొట్టుకొని శరీర అవసరాలను తీరుస్తూ అలసిపోతుంటాయి. లెక్కప్రకారం మనం పగలే తినాలి, తిరగాలి. అలాగే మీరు సాయంకాలం 6 గంటలకు తేలిగ్గా భోజనం చేసారు. అది రాత్రి 9 గంటలకి అరిగిపోతుంది. మీరు 10 గంటలకల్లా పడుకున్నారు. అంటే జీర్ణక్రియకు, శరీరానికి విశ్రాంతి. కాబట్టి మీ గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ రక్తాన్ని, ప్రాణవాయువును శరీరానికి అందించాల్సిన అవసరం లేదు. దీంతో గుండె, ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకుంటాయి. పగలు నిమిషానికి 72 సార్లు కంటే ఎక్కువగా కొట్టుకునే గుండె, మీరు పెందలాడే తిని పడుకోవడం వల్ల ప్రతి నిమిషానికి సుమారుగా 60 సార్లు మాత్రమే కొట్టుకుని ప్రతి నిమిషానికి 10 నుండి 12 సార్లు విశ్రాంతి తీసుకుంటుంది. ఒక నిమిషానికి 10 సార్లు అయితే ఎన్ని నిమిషాలున్నా అలా గంటలపాటు (నిద్రలేచేవరకూ) విశ్రాంతి లభిస్తున్నదో చూడండి. ఆ విశ్రాంతిలో గుండె కండరానికి ఎంత బలం పెరుగుతుందో ఆలోచించండి. అలాగే ఊపిరితిత్తులు అయితే నిమిషానికి 18 సార్లు బదులుగా 12 నుంచి 14 సార్లే కొట్టుకుని 4 నుండి 6 సార్లు ప్రతి నిమిషానికి విశ్రాంతిని తీసుకుంటున్నాయి. ఇలా కాకుండా రాత్రి 10, 11 గంటలకి ఫుల్లుగా తిని పడుకుంటే అది అరిగే దాకా (సుమారు తెల్లవారుదాకా)గుండె, ఊపిరితిత్తులు నిరంతరం పనిచేయాల్సిందే. అందుచేతనే 60,70 సంవత్సరాలు వచ్చేసరికి ఈ అవయవాలు మొండికేస్తున్నాయి. పొద్దు పోయిందాకా తినడం, అర్ధరాత్రి వరకూ తిరగడం చేస్తూ గుండె, ఊపిరితిత్తుల పాలిట శాపంగా మనం తయారవుతున్నాం.

పొట్టఖాళీగా ఉంటే సుఖనిద్ర ఎందుకు పడుతుంది ?

సాధారణంగా పొట్టనిండా ఆహారం తీసికొంటేనే సుఖంగా నిద్రపడుతుందని అందరూ భావిస్తారు. పొట్టఖాళీగా ఉంటేనే సుఖనిద్ర పడుతుంది. ఇది నిజం. సాయంకాలం 5.30 నుంచి 6.00 గంటల వరకూ అందరూ ఆకలితో ఇంటికి చేరతారు. అప్పుడే భోజనం చేస్తే నిద్రరాదని, ఆ టైంలో చిల్లరతిండి తిని, రాత్రి 9 లేదా 10 గంటలకు భోజనం చేస్తే మత్తుగా నిద్ర వస్తుందని భావిస్తారు. పొట్టనిండా భోజనం చేస్తే మత్తు వస్తుంది. ఎందుకంటే మీ లోపల ఉన్న శక్తి, రక్తం, ప్రాణవాయువు మొదలైనవన్నీ జీర్ణాశయానికి మళ్ళించబడేసరికి, మీలో హుషారు తగ్గి మత్తుగా అవుతారు. అప్పుడు పడుకుంటే మీకు మత్తు నిద్ర వస్తుంది. మనిషికి కావాలసినది గాఢనిద్ర లేదా సుఖనిద్ర కాని మత్తు నిద్రకాదు. అసలు నిద్ర అంటే విశ్రాంతి. ఏ అవయవాలు నిద్రలో విశ్రాంతి తీసుకోవాలి? శరీరంలోని అన్ని అవయవాలా? లేదా కొన్నా?. అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటేనే మరలా ఉదయాన్నే చురుగ్గా అన్నీ పనిచేయగలవు. మీరు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పొట్టనిండా తిని పడుకుంటే ఏ అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయో ఆలోచించండి. కాళ్లు, చేతులు, కండరాలు, నరాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నాయి. మరి పొట్టనిండా ఆహారం తిని పడుకున్నందుకు దానిని అరిగించడానికి గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ పనిచేసి రక్తాన్ని ఆక్సిజన్‌ని అందించాలి. పొట్ట, ప్రేగులు, లివరు, పాంక్రియాన్‌ మొదలైన జీర్ణరసాలను ఊరించి ఆహారాన్ని అరిగించాలి. ఇన్ని అవయవాలు లోపల పనిచేస్తూ ఉంటే దానిని విశ్రాంతి అంటారా? దానిని సుఖనిద్ర అంటారా? ఈ పనులన్నీ అయ్యి పొట్ట, ప్రేగులు రెస్టు తీసుకోవడం ఎప్పటి నుండి ప్రారంభిస్తాయో, అప్పటినుండి మీ శరీరం అసలైన విశ్రాంతిని పొందడం ప్రారంభిస్తుంది. అప్పటినుండే గాఢనిద్ర లేదా సుఖనిద్ర ప్రారంభం వస్తుంది. తిని పడుకుంటే అది అరిగే దాకా మీకు మత్తునిద్ర మాత్రమే వస్తుంది.

అందరూ తిని పడుకుంటే బాగా నిద్ర వస్తుందంటుంటారు. ఎంతమంది పడుకున్న 5 లేదా 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకునేవారు చెప్పండి. నూటికి 90 మంది పైగా నిద్ర పట్టడానికి 30 నుండి 60 నిమిషాల వరకూ మంచం మీద పడుకుని నిద్రరాక పనికిరాని కబుర్లన్నీ చెప్పుకోవడం లేదా అటూ, ఇటూ దొర్లడం చేస్తారు. ఆ తర్వాత నిద్ర రాకుంటే కొందరైతే మందుబిళ్ళలు వాడుతున్నారు. మరికొందరు మద్యం సేవిస్తున్నారు.

మనిషి పడుకున్న దగ్గర్నుండీ లేచే లోపుగా బాగా గాఢంగా, సుఖంగా నిద్రపట్టే టైం ఏదని అడిగితే అందరూ తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్యలో అని సమాధానమిస్తారు. రాత్రి పడుకుంటే తెల్లవారుజామునే ఎందుకు సుఖ నిద్ర పట్టిందో అర్థమయ్యిందా ? మీ లోపల అన్ని పనులు అప్పటికి పూర్తయ్యాయి. అందుకే శరీరం హాయిగా గాఢనిద్రలోకి వెళ్తుంది. రాత్రిపూట 10 నుంచి 11 గంట మధ్య తిని పడుకోవడం వల్ల మీ శరీరం 2 నుంచి 3 గంటల పాటే సుఖనిద్ర పోతున్నది. అదే మీరు సాయంకాలం 6 గంటల కల్లా తింటే పడుకునే లోపు తిన్నది అరుగి వెంటనే నిద్రలోకి వెళ్తారు. పడుకున్న దగ్గర్నుంచీ సుఖనిద్ర 5 లేదా 6 గంటల పాటు పట్టి తెల్లారుజాము 4 గంటలకి మెలకువ వస్తుంది. నిద్రలేచిన దగ్గర్నుంచీ చాలా హుషారగా, కొత్తశక్తితో, చురుగ్గా ఉంటారు. పగలు వెలుతురుండగానే భోజనం చేస్తే పడుకున్న వెంటనే గాఢనిద్రలోకి వెళ్తారని మరవకండి.

Heart diseases, how over come





గుండె బాగుండాలంటే...

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. అది ఆరోగ్యంగా ఉండాలంటే దాని గురించిన అవగాహన ఉండాలి. గుండెకు సంబంధించిన వివిధ సమస్యలకు, గుండె జబ్బుకు తేడా తెలిసి ఉండాలి. ఎందుకంటే కొందరు గుండె దడగా ఉన్నా గుండె జబ్బేమోనని కంగారు పడుతుంటారు. సరైన అవగాహన ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు. 
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నేడు యువకుల్లో కూడా గుండె జబ్బులు రావడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం. వేటివల్ల గుండెకు ముప్పు ఉంటుందో వాటిని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొవ్వు ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు ఆరోగ్యకరమైనక జీవన విధానం అలవర్చుకోవాలి. ధూమపానం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతున్నాయి.
లక్షణాలు
కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఒక్కోసారి ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని కచ్చితంగా చెప్పలేం. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే నిర్ధారణకు రావాలి.
రెగ్యులర్‌ చెకప్‌
నలభయ్యేళ్లు దాటినవారు రెగ్యులర్‌గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందే జాగ్రత్తపడవచ్చు. ఇసిజి, 2 డి ఎకో, కొలెస్ట్రాల్‌, టిఎంటి పరీక్షల ద్వారా గుండె పనితీరు, జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి, చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య
తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
గుండె జబ్బు ఉంటే

పరీక్షల్లో గుండె జబ్బు ఉందని తేలినట్లయితే, అప్పుడు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎక్కడుంది, ఎన్నిచోట్ల రక్త నాళాల్లో అడ్డంకులున్నాయి తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్‌ పరీక్ష అవసరం. ఒకటి లేక రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు, అంతకంటే ఎక్కువబ్లాక్‌లు ఉన్నా, గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్‌ఎంసిఎ)లో సమస్య ఉన్నా బైపాస్‌ సర్జరీ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఔషధ పూరిత స్టెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినట్లయితే స్టెంట్లల్లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్‌లు వేసినా, బైపాస్‌ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్య తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం. కొందరు ఆపరేషన్‌ జరిగింది కదా, ఇక ఏం పర్వాలేదు అని మందులు ఆపేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, డైట్‌ కంట్రోల్‌ చేయాలి. వ్యాయామం చేయడం మరవద్దు.

జాగ్రత్తలు ...!

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ అరగంట పాటు నడవడంవల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. దీంతోపాటు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మీ గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.

Tuesday, 11 November 2014

Take care of Kidney's కిడ్నీలు భద్రం ...!




కిడ్నీలు భద్రం ...!



కిడ్నీల పనితీరు బాగుండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. నీరు లేకుండా కిడ్నీలు మలినాలను బయటకు సమర్ధవంతంగా పంపించలేవు. నీళ్లు లేకుండా మలినాలను బయటకు పంపించడానికి కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజూ తగినన్ని నీళ్లు తాగడం మరువద్దు.

షుగర్‌, ప్యాకేజ్డ్‌, రిఫైన్డ్‌ ఫుడ్‌ రోజూ తీసుకుంటాం. అంతర్గత వ్యవస్థను శుభ్రపరచడానికి ప్రత్యేకంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోము. ఫలితంగా శరీరంలో నికోటిన్‌, కెఫిన్‌, పొల్యూషన్‌ పెరిగిపోతాయి. కాబట్టి మనం శరీరాన్ని క్లీన్‌ చేసుకోవడానికి ఒక రోజు కేటాయించాలి. అదెలా అంటే ఆ రోజంతా క్లీన్‌సింగ్‌ జ్యూస్‌ డైట్‌ తీసుకోవాలి. ఈ ఫుడ్‌ టాక్సిన్లను బయటకు పంపేలా చేస్తుంది.

కూరగాయలు, పండ్లలో ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలోని అదనపు యాసిడ్లను బయటకు పంపడానికి ఉపకరిస్తాయి.

ప్రొటీన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. కానీ ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఎక్కువ భారం పడుతుంది. అదనపు ప్రొటీన్‌ కిడ్నీ మాల్‌పంక్షన్‌కు దారితీస్తుంది.

ముదురు ఆకుపచ్చ కూరగాయలు, విత్తనాలు, నట్స్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.

కిడ్నీలు శరీరంలో రక్తాన్ని ఫిల్టర్‌ చేయడంతో పాటు వ్యర్థపదార్థాలను, నీరును ప్రతి అరగంటకొకసారి తొలగిస్తుంటుంది.

కిడ్నీలు రెండింటిలో ఒకటి చెడిపోయినా ఒక్క కిడ్నీతో కూడా జీవనం సాఫీగానే సాగిపోతుంది.

కిడ్నీలు చెడిపోవటానికి ముఖ్యకారణాలు రెండు, అవి ఒకటి హైబీపీ, రెండవది డయాబెటిస్‌.

కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించలేం. ఎందుకంటే వ్యాధిని గుర్తించడానికి లక్షణాలు కనిపించవు. రక్తపరీక్షల్లోనూ, మూత్రపరీక్షల్లోనూ కిడ్నీల పనితీరు బాగానే ఉన్నట్లు వస్తుంది. కానీ రిస్క్‌ ఉండి ఉండవచ్చు.

Wednesday, 5 November 2014

Red Wine వ్యాయామంలా పనిచేసే... రెడ్‌ వైన్‌.....!



వ్యాయామంలా పనిచేసే...
రెడ్‌ వైన్‌.....!

రోజూ గంటపాటు వ్యాయామం చేసే మీరు ఒకరోజు వ్యాయామాలకు డుమ్మాకొట్టారా? 
అయినా ఆందోళన పడక్కర్లేదు. కాస్తంత రెడ్‌వైన్‌ తాగితే వ్యాయామాలు చేయని లోటు పూరించబడుతుంది. గంటపాటు వ్యాయామం చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఒక గ్లాసుడు రెడ్‌ వైన్‌తో మనం పొందగలుగుతాము.
ఎర్ర ద్రాక్షలో రెస్‌వెరాట్రోల్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఉంది. గంటపాటు మనం వ్యాయామం చేస్తే కండరాలు, గుండె ఎంత బాగా పనిచేస్తాయో అలాగే ఎర్ర ద్రాక్షలోని ఈ యాంటాక్సిడెంట్‌ మన శరీరంపై పనిచేస్తుంది. మంచి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది. కెనడా అధ్యయనకారులు చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. శారీరకంగా వ్యాయామాలు చేయలేని వారికి రెడ్‌ వైన్‌ ఎంతో సహాయపడుతుంది. రెస్‌వెరాట్రోల్‌ యాంటాక్సిడెంట్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరం చురుగ్గా పనిచేస్తుంది. ఎముకలు, గుండె పటిష్టంగా ఉంటాయి. రెస్‌వెరాట్రోల్‌ యాంటాక్సిండెంట్‌ పిల్‌ తయారీపై కూడా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. గతంలో చేసిన అధ్యయనాల్లో రెడ్‌ వైన్‌లో ఉండే రెస్‌వెరాట్రోల్‌ వల్ల కాటారాక్టు రాదని తేలింది. అంతేకాదు ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది, క్యాన్సర్‌ రిస్కు నుంచి సైతం కాపాడుతుంది.

After 40 + takecare of your health

45 సంవత్సరాలు దాటిన మహిళలకు డైట్‌, వ్యాయామాలు ఎంతో ముఖ్యం..!

చాలామంది ఆడవాళ్లు 45 సంవత్సరాలు దాటితే ఇక జీవితం లేదనుకుంటారు. తమ ఆరోగ్యం, శరీర విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలా కాకుండా డైట్‌ విషయంలో, శరీర వ్యాయామాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే 60 ఏళ్లు వచ్చినా వాళ్లు యవ్వనంగానే కనబడతారు.

అందుకే 45 సంవత్సరాలు దాటిన మహిళలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

బరువు: ప్రతి ప్రసవానికీ ఆడవాళ్లు బరువు పెరుగుతుంటారు. తల్లిపాల వల్ల కూడా వాళ్ల శరీర బరువు పెరుగుతుంది. ఫలితంగా శరీరాకృతి కోల్పోయి లావుగా తయారవుతారు. అలా కాకుండా బరువు తగ్గాలంటే ఈ వయసు మహిళలు నిత్యం ఆరోగ్యకరమైన డైట్‌ తీసుకోవాలి. వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

డైట్‌: తిండి విషయంలో నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి. వారానికొకసారి పళ్లు, కూరగాయలను డైట్‌గా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరం చురుగ్గా ఉండడమే కాకుండా జీర్ణ వ్యవస్థ బాగు పడుతుంది. దీంతో మునుపటి శరీరాకృతిని తిరిగి పొందగలుగుతారు.

వ్యాయామాలు: ఈ వయసు ఆడవాళ్లు రోజూ తప్పనిసరిగా నడవాలి. నడకను మించిన మందు మరొకటి లేదు. ఇంట్లో, ఆఫీసులో ఎంత పని ఉన్నా నడకను మటుకు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత వేగంగా నడిస్తే అంత మంచిది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. సన్నబడతారు. నడవడం వల్ల ఫీల్‌ గుడ్‌ హార్మోన్స్‌ అయిన ఫెరోమోన్స్‌ విడుదలవుతాయి. ఫలితంగా ఈ వయసు ఆడవాళ్లు అన్నివేళలా చురుగ్గా ఉండగలుగుతారు.

హార్మోన్లు: 45 సంవత్సరాలు దాటాయంటే ఆడవాళ్లు మెనోపాజ్‌లోకి ప్రవేశించే వయసన్న మాట. ఈ టైములో హార్మోన్లలో సంభవించే ఒడిదుడుకుల వల్ల మానసికంగా, శారీరకంగా రకరకాల సమస్యలను వీళ్లు ఎదుర్కొంటారు. చర్మంలో కూడా మార్పులు సంభవిస్తాయి. జుట్టు రాలిపోవడం లేదా వెంటుక్రలు బాగా పలచబడటం జరుగుతుంది.
జుట్టు పెరగాలంటే రెండు గుడ్లను (ఒక పచ్చసొనను) బ్రేక్‌ఫాస్ట్‌గా తినాలి. గుడ్డు తిననివాళ్లు వెన్న తప్పనిసరిగా తినాలి. ఈ వెన్నలో ఉప్పు ఉండకూడదు. రోజుకు 30 గ్రాముల వెన్న తినాలి. ఒక గ్లాసుడు పాలు లేదా ఒక కప్పు పెరుగు తీసుకున్నా మంచిదే. అలాగే బాగా నిద్రపోవాలి. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు కొంతకాలంపాటు యాంటాక్సిడెంట్‌ సప్లిమెంట్‌ థెరపీ తీసుకుంటే మంచిది.
ఈ వయసులో ఆడవాళ్లకు యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్లు రావడం సహజం. నిమ్మకాయ నీళ్లలాంటివి ఎక్కువ తీసుకోవాలి. దానిమ్మ, పైనాపిల్‌, యాపిల్‌, కమలా పళ్ల రసాలు తాగితే మంచిది. ఇకొలీ బాక్టీరియా వల్ల యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. అలాగే తెల్లబట్ట కూడా ఈ వయసు మహిళలకు ఎక్కువగా అవుతుంటుంది. యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవాళ్లు మజ్జిగ, పెరుగును బాగా తీసుకోవాలి. విటమిన్‌-సి సప్లిమెంట్లను తీసుకోవాలి. పళ్లరసాలు బాగా తాగాలి.

- డా.జానకి
న్యూట్రిషనిస్టు,
హైదరాబాద్‌