పోషకాల గని...కివి!
ప్రకృతిలో మనకు లభించే 27రకాల పండ్లలో అతి ఎక్కువ పోషకాలున్న ఫలం కివి. అందుకే ఈ పండును వండర్ ప్రూట్ అం టారు. దీనిని చైనీస్ గూస్బెర్రీస్‌గా పిలుస్తారు. న్యూజిలాం డ్, చిలీ, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా వంటి చల్లని దేశాల్లో ఎక్కువగా పండే కివి పండ్లను మన దేశంలోనూ హిమాచల్‌ప్రదేశ్‌లో పండిస్తున్నారు. ఇందులో ఆరెంజ్ పళ్లకు రెంట్టిపు శాతంలో విటమిన్ సి, ఆపిల్ కన్నా ఐదు రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. శరీర పోషణకు కావల్సిన విటమిన్ ఇ, పోటాషియం,ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటీనాయిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు తక్కువగా , ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులున్న వారు కూడా నిశ్చింతగా ఈ పండ్లను తమ మెనూలో చేర్చుకోవచ్చు.
విటమిన్లు.. ప్లావనాయిడ్స్, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండే కివి పళ్లను ఎక్కువగా తింటే కంటి సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు.
అధిక బరువు తగ్గాలనుకునే వారు కివి పండు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.
పెరిగే వయస్సుతో పాటు వచ్చే కణాల క్షీణత ఈ పండు తినడం వల్ల 36శాతం వరకు తగ్గుతుందని పరిశోధనల్లో స్పష్టమైంది.
క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు మార్పులను అరికట్టే పదార్థాలు కివిలో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో లభించే గ్లుటథియోన్ క్యాన్సర్ కు దారితీసే పరిస్థితులను నివారిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్, లుటెయిన్ ప్రోస్టేట్ గ్రంధి, కాలేయ క్యాన్సర్‌లను నివారిస్తాయి.
ఇందులో సమృద్ధిగా లభించే అమినోయాసిడ్ ఆర్జినిన్ రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఆర్జినిన్, గ్లుటామిన్ అనే రెండు అమినోయాసిడ్స్ ఎక్కువగా ఉండి.. గుండెకు రక్తప్రసరణం బాగా జరిగెందుకు దోహద పడుతాయి.
కివిలో ఉండే ఇనోసిటాల్ అనే పదార్థం మానసికవ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అధికంగా ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగ పడుతుంది. ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
0 comments:
Post a Comment