ఆరోగ్యానికి ఆనందం.. యాపిల్
రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్‌తో పనిలేదు. ఉప్మా, ఇడ్లీ, పూరీ, వడ, చపాతీ, పిజ్జా, బర్గర్, బిర్యానీ... ఇవి తిని ఆరోగ్యానికి తూట్లు పొడుచుకునే బదులు రోజూ ఓ యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో ఆలోచించండి. ముందు మనం చెప్పుకున్న ఆహార పదార్థాల కంటే యాపిల్ ఖరీదు ఎక్కువేం కాదు. ఆరోగ్యానికి హాని చేసే చెత్త తిండి, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినేకంటే రోజుకొక్క యాపిల్ తింటే ఎంతో ఉపయోగం. మంచి శక్తినిచ్చే ఆహారం యాపిల్. నీరసంగా ఉన్నప్పుడు, బాగా కష్టపడి పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క యాపిల్ తింటే చాలు.. తెలీకుండానే ఉల్లాసం వచ్చేస్తుంది. యాపిల్ తినడం వల్ల దంతాలపై గార తొలగిపోయి తళతళలాడతాయి. ఇందులో ఉన్న విటమిన్ సి శరీరంలోని ఇమ్యూనిటీని పెంచుతుంది. అధిక బరువును అరికడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రోజూ యాపిల్ తింటే బ్లెడ్ షుగర్, డయాబిటీస్, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందీ యాపిల్.
0 comments:
Post a Comment