కిడ్నీలు భద్రం ...!
కిడ్నీల పనితీరు బాగుండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. నీరు లేకుండా కిడ్నీలు మలినాలను బయటకు సమర్ధవంతంగా పంపించలేవు. నీళ్లు లేకుండా మలినాలను బయటకు పంపించడానికి కిడ్నీలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజూ తగినన్ని నీళ్లు తాగడం మరువద్దు.
షుగర్, ప్యాకేజ్డ్, రిఫైన్డ్ ఫుడ్ రోజూ తీసుకుంటాం. అంతర్గత వ్యవస్థను శుభ్రపరచడానికి ప్రత్యేకంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోము. ఫలితంగా శరీరంలో నికోటిన్, కెఫిన్, పొల్యూషన్ పెరిగిపోతాయి. కాబట్టి మనం శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక రోజు కేటాయించాలి. అదెలా అంటే ఆ రోజంతా క్లీన్‌సింగ్ జ్యూస్ డైట్ తీసుకోవాలి. ఈ ఫుడ్ టాక్సిన్లను బయటకు పంపేలా చేస్తుంది.
కూరగాయలు, పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలోని అదనపు యాసిడ్లను బయటకు పంపడానికి ఉపకరిస్తాయి.
ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. కానీ ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఎక్కువ భారం పడుతుంది. అదనపు ప్రొటీన్ కిడ్నీ మాల్‌పంక్షన్‌కు దారితీస్తుంది.
ముదురు ఆకుపచ్చ కూరగాయలు, విత్తనాలు, నట్స్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.
కిడ్నీలు శరీరంలో రక్తాన్ని ఫిల్టర్ చేయడంతో పాటు వ్యర్థపదార్థాలను, నీరును ప్రతి అరగంటకొకసారి తొలగిస్తుంటుంది.
కిడ్నీలు రెండింటిలో ఒకటి చెడిపోయినా ఒక్క కిడ్నీతో కూడా జీవనం సాఫీగానే సాగిపోతుంది.
కిడ్నీలు చెడిపోవటానికి ముఖ్యకారణాలు రెండు, అవి ఒకటి హైబీపీ, రెండవది డయాబెటిస్.
కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించలేం. ఎందుకంటే వ్యాధిని గుర్తించడానికి లక్షణాలు కనిపించవు. రక్తపరీక్షల్లోనూ, మూత్రపరీక్షల్లోనూ కిడ్నీల పనితీరు బాగానే ఉన్నట్లు వస్తుంది. కానీ రిస్క్ ఉండి ఉండవచ్చు.
0 comments:
Post a Comment