Pages

Tuesday, 4 November 2014

కాలేయాన్ని శుభ్రం చేద్దాం!




కాలేయాన్ని శుభ్రం చేద్దాం!

* కాలేయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక వ్యాధులను అరికట్టవచ్చు. 

అందుకు మూడు సులువైన మార్గాలు...

* దేహానికి తగినంత నీటిని అందించాలి. మంచినీళ్లు, గ్రీన్ టీ, తాజా పండ్ల రసాలు సమృద్ధిగా తీసుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడాన్ని నివారించవచ్చు.

* రోజూ తినే ఆహారంలో పసుపు వాడాలి. పసుపు వాపులను తగ్గించడంతోపాటు లివర్ ఇన్‌ఫెక్షన్‌లను నివారిస్తుంది.

* పోషకాహారాన్ని తీసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన పోషకాహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పాలకూర, క్యాబేజ్, వెల్లుల్లి, నిమ్మ, బత్తాయి, కమలా వంటి పుల్లటి పండ్లు తప్పని సరిగా ఉండాలి. ఇవి దేహంలోని విషపూరిత వ్యర్థాలను నశింపచేస్తాయి. తగినంత నీటిని తీసుకోవడం వల్ల అవన్నీ బయటకు విసర్జితమవుతాయి.

0 comments:

Post a Comment