వ్యాయామంలా పనిచేసే...
రెడ్ వైన్.....!
రోజూ గంటపాటు వ్యాయామం చేసే మీరు ఒకరోజు వ్యాయామాలకు డుమ్మాకొట్టారా?
అయినా ఆందోళన పడక్కర్లేదు. కాస్తంత రెడ్‌వైన్ తాగితే వ్యాయామాలు చేయని లోటు పూరించబడుతుంది. గంటపాటు వ్యాయామం చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఒక గ్లాసుడు రెడ్ వైన్‌తో మనం పొందగలుగుతాము.
ఎర్ర ద్రాక్షలో రెస్‌వెరాట్రోల్ అనే యాంటాక్సిడెంట్ ఉంది. గంటపాటు మనం వ్యాయామం చేస్తే కండరాలు, గుండె ఎంత బాగా పనిచేస్తాయో అలాగే ఎర్ర ద్రాక్షలోని ఈ యాంటాక్సిడెంట్ మన శరీరంపై పనిచేస్తుంది. మంచి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది. కెనడా అధ్యయనకారులు చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. శారీరకంగా వ్యాయామాలు చేయలేని వారికి రెడ్ వైన్ ఎంతో సహాయపడుతుంది. రెస్‌వెరాట్రోల్ యాంటాక్సిడెంట్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరం చురుగ్గా పనిచేస్తుంది. ఎముకలు, గుండె పటిష్టంగా ఉంటాయి. రెస్‌వెరాట్రోల్ యాంటాక్సిండెంట్ పిల్ తయారీపై కూడా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. గతంలో చేసిన అధ్యయనాల్లో రెడ్ వైన్‌లో ఉండే రెస్‌వెరాట్రోల్ వల్ల కాటారాక్టు రాదని తేలింది. అంతేకాదు ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది, క్యాన్సర్ రిస్కు నుంచి సైతం కాపాడుతుంది.
0 comments:
Post a Comment