45 సంవత్సరాలు దాటిన మహిళలకు డైట్, వ్యాయామాలు ఎంతో ముఖ్యం..!
చాలామంది ఆడవాళ్లు 45 సంవత్సరాలు దాటితే ఇక జీవితం లేదనుకుంటారు. తమ ఆరోగ్యం, శరీర విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలా కాకుండా డైట్ విషయంలో, శరీర వ్యాయామాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే 60 ఏళ్లు వచ్చినా వాళ్లు యవ్వనంగానే కనబడతారు.
అందుకే 45 సంవత్సరాలు దాటిన మహిళలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
బరువు: ప్రతి ప్రసవానికీ ఆడవాళ్లు బరువు పెరుగుతుంటారు. తల్లిపాల వల్ల కూడా వాళ్ల శరీర బరువు పెరుగుతుంది. ఫలితంగా శరీరాకృతి కోల్పోయి లావుగా తయారవుతారు. అలా కాకుండా బరువు తగ్గాలంటే ఈ వయసు మహిళలు నిత్యం ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.
డైట్: తిండి విషయంలో నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి. వారానికొకసారి పళ్లు, కూరగాయలను డైట్‌గా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరం చురుగ్గా ఉండడమే కాకుండా జీర్ణ వ్యవస్థ బాగు పడుతుంది. దీంతో మునుపటి శరీరాకృతిని తిరిగి పొందగలుగుతారు.
వ్యాయామాలు: ఈ వయసు ఆడవాళ్లు రోజూ తప్పనిసరిగా నడవాలి. నడకను మించిన మందు మరొకటి లేదు. ఇంట్లో, ఆఫీసులో ఎంత పని ఉన్నా నడకను మటుకు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత వేగంగా నడిస్తే అంత మంచిది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. సన్నబడతారు. నడవడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ అయిన ఫెరోమోన్స్ విడుదలవుతాయి. ఫలితంగా ఈ వయసు ఆడవాళ్లు అన్నివేళలా చురుగ్గా ఉండగలుగుతారు.
హార్మోన్లు: 45 సంవత్సరాలు దాటాయంటే ఆడవాళ్లు మెనోపాజ్‌లోకి ప్రవేశించే వయసన్న మాట. ఈ టైములో హార్మోన్లలో సంభవించే ఒడిదుడుకుల వల్ల మానసికంగా, శారీరకంగా రకరకాల సమస్యలను వీళ్లు ఎదుర్కొంటారు. చర్మంలో కూడా మార్పులు సంభవిస్తాయి. జుట్టు రాలిపోవడం లేదా వెంటుక్రలు బాగా పలచబడటం జరుగుతుంది.
జుట్టు పెరగాలంటే రెండు గుడ్లను (ఒక పచ్చసొనను) బ్రేక్‌ఫాస్ట్‌గా తినాలి. గుడ్డు తిననివాళ్లు వెన్న తప్పనిసరిగా తినాలి. ఈ వెన్నలో ఉప్పు ఉండకూడదు. రోజుకు 30 గ్రాముల వెన్న తినాలి. ఒక గ్లాసుడు పాలు లేదా ఒక కప్పు పెరుగు తీసుకున్నా మంచిదే. అలాగే బాగా నిద్రపోవాలి. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు కొంతకాలంపాటు యాంటాక్సిడెంట్ సప్లిమెంట్ థెరపీ తీసుకుంటే మంచిది.
ఈ వయసులో ఆడవాళ్లకు యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్లు రావడం సహజం. నిమ్మకాయ నీళ్లలాంటివి ఎక్కువ తీసుకోవాలి. దానిమ్మ, పైనాపిల్, యాపిల్, కమలా పళ్ల రసాలు తాగితే మంచిది. ఇకొలీ బాక్టీరియా వల్ల యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. అలాగే తెల్లబట్ట కూడా ఈ వయసు మహిళలకు ఎక్కువగా అవుతుంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవాళ్లు మజ్జిగ, పెరుగును బాగా తీసుకోవాలి. విటమిన్-సి సప్లిమెంట్లను తీసుకోవాలి. పళ్లరసాలు బాగా తాగాలి.
- డా.జానకి
న్యూట్రిషనిస్టు,
హైదరాబాద్

0 comments:
Post a Comment