Pages

Friday, 27 November 2015

Kartheeka Masa Siri.....Uusiri



Kartheeka Masa Siri.....Uusiri



Wednesday, 15 July 2015

For Beautiful Hair...Some changes in the food... అందమైన కురుల కోసం ... ఆహారంలో కొన్ని మార్పులు...!

అందమైన కురుల కోసం ... ఆహారంలో కొన్ని మార్పులు...!

 
 
 
జుత్తు పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్న ఒత్తుగా ఉండాలని కోరుకోని మహిళలు ఉండరు. పెరిగిపోతున్న కాలుష్యం, ఆధునిక జీవన శైలి కారణంగా అనేకమంది జుత్తు చిన్న వయసులోనే పల్చబడడమే కాదు రంగు కూడా మారిపోతున్నది. నెత్తి మీద దువ్వెన పెడితే తుట్టెలు తుట్టెలుగా వెంట్రుకలు ఊడొస్తుంటే బెంగపడిపోతుంటారు మహిళలు. అయితే ఊరికే బెంగపడకుండా తమ ఆహారపు అలవాట్లను ఒకసారి పరిశీలించుక...ోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆహారంలో కొన్ని మార్పులను చెప్తున్నారు.

• కారెట్లు...

విటమిన్‌ ఎ అధికంగా ఉండే కారెట్లను తీసుకోవడం వల్ల కేవలం కంటికే కాదు జుత్తకు కూడా మంచిదంటున్నారు నిపుణులు. మాడు ఆరోగ్యంగా ఉంటే నల్లగా మెరిసే, బలమైన జుత్తు పెరుగుతుందిట. ప్రోటీన్లు, పళ్ళు, కాయగూరలు, పప్పులు, చేపలు, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా జుత్తు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి.

• ఎండుద్రాక్షలు...

జుత్తు ఎండిపోయినట్టు గడ్డిలా ఉండి, పల్చబడిపోయి, రంగు వెలిసిపోయినట్టు ఉంటే లేదా తెగ ఊడిపోతుంటే అందుకు కారణం శరీరంలో ఐరన్‌ శాతం తగ్గిపోవడమే. ఎండు ద్రాక్షలలో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండడమే కాక జుత్తు క్వాలిటీ పెరిగేలా చేస్తుంది. దీనితో పాటుగా ఆకుకూరలు, బీట్‌రూట్‌లు కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

• పచ్చి బఠాణీలు...

పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉన్నా, నిర్దిష్టమైన విటమిన్‌ లేదా మినరల్స్‌ ఎక్కువగా లేకపోయినా వాటిలో విటమిన్లు, మినరల్స్‌, ఐరన్‌, జింక్‌, బి గ్రూప్‌ విటమిన్లు సమతులంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన జుత్తుకు మంచివి.

• ఓట్స్‌...

ఓట్లలో ఫైబర్‌ అధికంగా ఉం టుంది. ఇది గుండెకు సంబం ధించిన ఆరోగ్యాన్ని సంరక్షించి, విసర్జనను క్రమబద్ధం చేస్తుంది. ఫైబర్‌తో పాటుగా జింక్‌, ఐరన్‌, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. వీటన్నింఇనీ పాలి అన్‌ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్లని అంటారు. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి, జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది కేవలం ఆహారం ద్వారానే లభ్యమవుతుంది కనుక బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

• చిన్న రొయ్యలు...

చిన్న రొయ్యలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.ఇందులో ఉండే విటమిన్‌ బి12, ఐరన్‌, జింక్‌ జుత్తు ఊడిపోకుం డా కాపాడుతుంది. రెడ్‌ మీట్‌ను అతి గా తీసుకోవడం మాని అందుకు ప్రత్యామ్నాయంగా వీటిని ఎంచుకోవచ్చు.

• గుడ్లు...

ఒతైన నల్లని ఆరోగ్యవంతమైన జుత్తు కోసం కోడిగుడ్లను ఉంచుకోవడం మంచిది. ప్రోటీన్లు, విటమిన్‌ బి 12, ఐరన్‌, జింక్‌, ఒమేగా 6 ఆమ్లాలు అధికంగా ఉంటాయి. విటమిన్‌, మినరల్‌ లోపాలు ఉన్నప్పుడు జుత్తు ఆరోగ్యంగా కనుపించదు. గుడ్లలో ఉండే బయోటిన్‌ (విటమిన్‌ బి7) అనే పదార్ధం జుత్తు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.

కొవ్వు తక్కువ పాలు, పెరుగు...
కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పెరుగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనితో పాటుగా హైక్వాలిటీ ప్రోటీన్లైన వే, కేసిన్‌లు ఇందులో ఉంటాయి.

Monday, 13 July 2015

Benefits of Shikakai for Hair


Benefits of Shikakai for Hair

➺ With regular use of shikakai, you can have lustrous, thick, and healthy hair.

➺ It helps retain natural oil in the hair and scalp, and prevents hair loss. It helps strengthen hair roots.

➺ You won't need a conditioner if you are using this Ayurvedic powder to wash your hair. It acts as a detangler. Most conditioners eventually lead to hair loss.

➺ As it contains several natural herbs that exhibit antimicrobial properties, it helps to get rid of lice.

➺ It is used to combat dandruff. An infusion of shikakai leaves has been used in anti-dandruff preparations for centuries. It not only eliminates dandruff but prevents it too.

➺ It is packed with vitamins A, C, D, and K that are essential for hair health. It contains antioxidants too. All these nutrients help prevent diseases and promote rapid growth of hair.

➺ Shikakai bark is packed with saponins, which act as foaming and cleansing agents. Although it acts like a soap or shampoo, it is mild and natural, and so, does not cause serious side effects.

➺ Regular use of shikakai can help delay the appearance of gray hair.

➺ It protects the scalp from fungal infections.

➺ If you start using shikakai, you will notice increased silkiness and bounciness of hair within a couple of months.

➺ Those who color their hair will find that cleaner and healthier hair can give better color result.

➺ As it prevents hair loss and strengthens hair roots, it provides volume to your hair within a few months.

Egg white and Yogurt Hair pack for Thinning hair and Hair Fall




Egg white and Yogurt Hair pack for Thinning hair and Hair Fall

Mix one egg white with a cup of yogurt. Separate hair strands part by part, apply the mask all over your scalp & hair.Keep the mask for 30 to 40 minutes & then wash off by a herbal shampoo.

Improve of Eye Vision.కంటిచూపును మెరుగుపరిచే ఖర్జూరం









* కంటిచూపును మెరుగుపరిచే ఖర్జూరం..!!
 
నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎంతో తియ్యని ఖర్జూరాన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా, ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ కనీసం ఒక్కటైనా తీసుకోగలిగితే ఎన్నో సహజ పోషకాలను సులువుగా పొందవచ్చంటున్నారు.ముఖ్యంగా ఖర్జూరాల్లో క్యాల్షియం, సల్ఫర్‌, ఇనుము, పొటాషియం , ఫాస్పరస్‌, మ్యాంగనీస్‌, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు సమౄఎద్ధిగా లభిస్తాయి. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ను నివారించే శక్తి కూడా వీటికి ఎక్కువగా ఉంది. అలాగే ఇందులోని విటమిన్‌ ’ఎ’ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఊపిరితి త్తులు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇనుము వల్ల రక్తహీనత సమస్య అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

Shine Hair మెరిసే జుట్టు సొంతమిలా... !







మెరిసే జుట్టు సొంతమిలా... !
జుట్టు మెరుస్తూ ఉండడానికి మార్కెట్‌లో దొరికే కండిషనర్స్‌కి బదులుగా.. మనకు ఇంట్లో కనిపించే కొన్ని పదార్థాలనూ వాడొచ్చు.
ఇవి ప్రయత్నించండి..
• వెంట్రుకల్లోని తేమని నిలిపి ఉంచడంలో కొబ్బరినూనె ఎంతో సాయపడుతుంది. గోరువెచ్చని కొబ్బరినూనెని తల, మాడుకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఇది మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
• పెరుగులోని పోషకాలు జుట్టు మెరిసేందుకు సాయపడతాయి. పెరగూ, అరటి పండు ముక్కలను బాగా చిదిమి దానికి అరచెంచా బాదం నూనె కలిపి స్నానం చేయాలి.
• తేనె కూడా జుట్టుకు మెరుపు తీసుకొస్తుంది. రెండు చెంచాల తేనెని రెండు కప్పుల వేడి నీళ్లలో కలపాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి షాంపూ చేసిన తర్వాత జుట్టుపై స్ప్రే చేయాలి. ఐదు నిమిషాలపాటు వేళ్లతో మసాజ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

Sunday, 21 June 2015

మ్యాంగో బ్యూటీ mango beauty





మ్యాంగో బ్యూటీ mango beauty


మామిడి పండ్లు తినటానికే కాదు సౌందర్య పోషణకూ ఉపయోగపడతాయి. ఈ పళ్లలోని విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడతాయి. కాబట్టి వీలైనప్పుడల్లా మామిడి పండ్లతో ఈ సౌందర్య చికిత్సలు ప్రయత్నిస్తూ ఉండండి.
• చర్మ సౌందర్యం..!
పచ్చి మామిడిలో యాసి్ట్రంజెంట్‌ గుణాలుంటాయి. మామిడి తొక్కలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు మృత కణాల్ని తొలగించి చర్మపు మెరుపును పెంచుతాయి. ఈ పళ్లలోని విటమిన్‌-సి చర్మం అడుగున కొల్లాజెన్‌ తయారీకి ఉపయోగడుతుంది. విటమిన్‌-ఎ చర్మం నుంచి నూనె కారడాన్ని తగ్గించి మొటిమలు రాకుండా నియంత్రిస్తుంది. అలాగే చర్మం మీద గీతలు, ముడతలను నివారిస్తుంది. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌, స్కిన్‌ ఏజింగ్‌కు కారణమయ్యే ప్రమాదకర ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. చర్మ సౌందర్యానికి దోహదపడే ఇన్ని సుగుణాలున్న మామిడితో ఫేస్‌ ప్యాక్‌, స్క్రబ్స్‌ తయారుచేసుకుని వాడాలి.
• మెరిసే చర్మం కోసం ‘మ్యాంగో ఫేస్‌ప్యాక్‌’
3 టీస్పూన్ల మామిడి పండు గుజ్జుకు ఒక ఎగ్‌ వైట్‌, అర టీస్పూను తేనె చేర్చి బాగా బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద అప్లై చేసి 15 నిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
• ‘మ్యాంగో స్క్రబ్‌’
4 టే.స్పూన్ల మామిడి పండు గుజ్జుకు అర కప్పు ఓట్స్‌, తగినన్ని పాలు చేర్చి చిక్కటి పేస్ట్‌ తయారుచేయాలి. దీన్ని ముఖం, మెడ మీద అప్లై చేసి మునివేళ్లతో గుండ్రంగా మసాజ్‌ చేయాలి. 15 నిమిషాలాగి చన్నీళ్లతో కడిగేసుకోవాలి.
• శిరోజ సౌందర్యం..!
మామిడి పళ్లు తినటం వల్ల జుట్టు తెల్లబడటం తగ్గి మెరుస్తూ ఉంటుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల కుదుళ్లకు పోషణనిచ్చి పెరగటానికి తోడ్పడతాయి. మామిడి పండులోని బి-కాంప్లెక్‌ విటమిన్లు, మినరల్స్‌ జుట్టుకు బలాన్నిచ్చి చుండ్రును నివారిస్తాయి.
• మెరిసే జుట్టు కోసం ‘మ్యాంగో మాస్క్‌’
మామిడి పండు గుజ్జుకు పుల్లటి పెరుగు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. 30 నిమిషాలాగి తలస్నానం చేస్తే చుండ్రు వదిలి జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.

శిరోజాలకు పోషకాహారం ..!




శిరోజాలకు పోషకాహారం ..!


జుట్టు ఊడిపోతుంటే చాలామంది తెగ ఆందోళన పడిపోతుంటారు. కానీ మనం తినే ఆహారం బట్టి కూడా శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం ఎంతమందికి తెలుసు? అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. పలచబడుతుంది. వెంట్రుకలు పొడిబారిపోతాయి. అంతేకాదు తెల్లబడతాయి కూడా. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా ఆ ప్రభావం శిరోజాల పెరుగుదల మీద, చర్మ ఆరోగ్యం మీద పడుతుంది. కాలుష్యం, పర్యావరణంలో మార్పులు సైతం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే నిత్యం పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజూ సమతులాహారం తీసుకోవడమే కాదు సమయానికి భోజనం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ శిరోజాల పెరుగుదల మీద ప్రభావం చూపుతాయి. అంతేకాదు మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆలస్యంగా పడుకోవడం లాంటి అలవాట్ల వల్ల శరీరంలోని వివిధ అంగాల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటితోపాటు శిరోజాల దృఢత్వం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే శరీర భాగాలకు పోషకాహారం ఎంత అవసరమో జుట్టు పెరుగుదలకు కూడా పౌష్టికాహారం అంతే అవసరం.
మనం తీసుకునే పోషకాహారం బట్టి శిరోజాల పెరుగుదల ఉంటుందని పోషకాహార నిపుణులు సైతం చెప్తున్నారు. మనం తినే సమతులాహారం రకరకాల జబ్బుల బారిన పడకుండా మనల్ని కాపాడడమే కాదు శిరోజాల్ని, చర్మాన్ని కూడా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇటీవల చిన్నా, పెద్దా అందరూ ఫాస్ట్‌ఫుడ్స్‌కు బాగా అలవాటుపడ్డారు. దీంతో పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లను, మినరల్స్‌ను, ఎంజైములను వాళ్లు కోల్పోతున్నారు. అలాగే బరువు తగ్గాలని కొందరు తిండి సరిగా తినడంలేదు. ఇవన్నీ శరీరారోగ్యం మీద తద్వారా శిరోజాలు, చర్మం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అందుకే సమ పాళ్లల్లో పిండిపదార్థాలు, ప్రొటీన్లు, సప్లిమెంట్లు , ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. శిరోజాల పరిరక్షణలో ఐరన్‌ ప్రముఖపాత్ర వహిస్తుంది. ఆకుకూరల్లో ఇది బాగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా తినాలి.
తేనె, బ్లాక్‌ చెన్నా, పాలకూరలలో కూడా ఐరన్‌ బాగా ఉంటుంది. జుట్టు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్‌-ఇ, విటమిన్‌-బి, విటమిన్‌-సిలు అత్యావశ్యకాలు. జీడిపప్పులు, బాదంపప్పుల్లో విటమిన్‌-ఇ పుష్కలంగా ఉంటుంది. మామిడిపండు, పుచ్చకాయల్లో విటమిన్‌-బి బాగా ఉంటుంది. శిరోజాల పెరుగుదలకు ఇవి అవసరం. ఒకవేళ జుట్టు బాగా ఊడిపోతున్న పక్షంలో అత్యాధునికమైన హెయిర్‌ రెజ్యువనేషన్‌ ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకోవచ్చు. జుట్టు చిట్లిపోవడం సమస్యతో కొందరు బాధపడుతుంటారు. వీళ్లు అరటిపండు పేస్టు, కలబంద జెల్‌, కొబ్బరినూనెలను వాడితే మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యం సమతులాహారం తీసుకోవడం ద్వారా శిరోజాలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
సో....
మంచి ఫుడ్‌ తినండి... శరీరారోగ్యంతోపాటు శిరోజాల ఆరోగ్యమూ కాపాడుకోండి...!

నేరేడుపళ్లు చేసే మేలు.. !



నేరేడుపళ్లు చేసే మేలు.. !




నేరేడు పళ్లు నీలాల కళ్లు... అంటూ నేరేడు పళ్ల గురించి రాశాడో సినీకవిరేడు. నేరేడు పళ్లు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
* ఇంతకీ నేరేడు పళ్లు శరీరానికి చేసే మేళ్లు ఏంటంటే..
• నేరేడుపళ్లలో గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వ్యాధికి చక్కగా ఉపయోగపడతాయి. యాంటీ డయాబెటిక్‌ ఎఫెక్ట్స్‌ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది.
• కాల్షియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే వ్యాధి నిరోధకశక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది.
• హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి.
• ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు పళ్లు.
• గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకునే శక్తి నేరేడుకు ఉంది.
నేరేడు చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్‌ని తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి.
• నేరేడు పళ్లు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణసంబంధిత సమస్యలను తగ్గుతాయి.
• క్యాన్సర్‌ రాకుండా చేయడంలో నేరేడు పళ్లు ముఖ్యపాత్ర వహిస్తాయి.
• వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని తగ్గింగే గుణం ఈ పళ్లకు ఉంది.
• శరీరంలో వేడిని తగ్గించి.. తక్షణ శక్తిని ఇస్తాయి.

List of vitamin's for help for fast hair growth

List of vitamin's for help for fast hair growth

Vitamin's are very useful for faster hair growth.  This vitamin's is must for our hair to growth faster.  The following are the list of vitamin's for help for fast hair growth.




  • Vitamin A
  • Vitamin B
  • Vitamin B3
  • Vitamin B12
  • Vitamin C
  • Vitamin  E
Vitamin A:-  The following are the food  from in food

  1. Sweet Potato (Cooked)
  2. Dark Leafy Greens (Kale, Cooked)
  3. Squash (Butternut, Cooked)
  4. Cos or Romaine Lettuce   
  5. Dried Apricots 
  6. Cantaloupe Melon
  7. Sweet Red Peppers
  8. Tuna Fish (Bluefin, Cooked)
  9. Tropical Fruit (Mango)
  10. Carrots (Cooked)
Vitamin B, B3, B12:-   The following are the food  from in food
  • vegetables such as peas 
  • fresh and dried fruit  
  • eggs 
  • wholegrain breads  
  • liver 
  • milk  
  • rice 
  • meat 
  • wheat flour  
  • chicken
  • beef
  • potatoes 
  • broccoli
  • wholegrains such as brown rice and wholemeal bread 
  • vegetables
  • soya beans
  • peanuts
  • broccoli
  • brussels sprouts
  • liver
  • spinach
  • asparagus
  • peas
  • chickpeas
  • fortified breakfast cereals 
Vitamin C:-     The following are the food  from in food

  • Papaya
  • Peas (Mange Tout)
  • Tomatoes (Cooked)
  • Citrus Fruits (Oranges)
  • Berries (Strawberries)
  • Guavas 
  • Peppers (Yellow Bell Peppers)
Vitamin E:-   The following are the food  from in food

  • Olives
  • Kiwi and Mango
  • spainach
  • raw seeds
  • plant oils
 
       
 

Wednesday, 10 June 2015

Sweet potatoe



Sweet potatoe



Sweet potatoes are the regular potatoes lost and often forgotten cousin. When you order a loaded baked potato at a restaurant, you are just asking to pack on the pounds with the sour cream, cheese and bacon bits. Instead, try eating a sweet, delicious and filling sweet potato that is low in calories and full with great nutrients like potassium, beta carotene, vitamin C and loads of fiber.

కలబందతో అందం...ఆరోగ్యం...! beauty and Health with aloe vera



 కలబందతో అందం...ఆరోగ్యం...!


వేసవిలో సూర్య తాపానికి చర్మం తొందరగా దెబ్బతింటుంది. నల్లబడిపోతుంది. అందుకే ఎండాకాలంలో కలబంద (అలొవిరా)ను వాడితే చర్మానికి ఎంతో మంచిదంటారు సౌందర్యనిపుణులు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా కలబంద ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. రకరకాల అనారోగ్య సమస్యలు, సౌందర్య సమస్యల పరిష్కారానికి కలబందతో ఎన్నో వంటింటి చిట్కాలను మన ఇళ్లల్లోని బామ్మలు చెపుతుంటారు. కలబంద వల్ల పొందే లాభాల గురించి చెప్పాలంటే చాలా పెద్ద జాబితానే ఉంది. కలబంద జెల్‌ను శరీరంలోని అన్ని భాగాలపైనా రాయొచ్చు. దాని గుజ్జును (జెల్‌) అలాగే తినొచ్చు. లేదా ఏదైనా ఆహారపదార్థంతో కలిపి తీసుకోవచ్చు. అలా ఇష్టంలేనివారు ఆ జెల్‌ని ఏదైనా డ్రింకులో కలుపుకుని తాగొచ్చు. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తలెత్తవు. శరీరారోగ్యానికి కూడా ఎంతో మంచిది . కలబంద కాండంపై ఉండే తొక్కు తీసేసి అందులోంచి జెల్‌ని తీస్తారు. దీన్ని ముఖానికి ఫేస్‌ మాస్క్‌లాగా కూడా వాడొచ్చు. కలబందలోని జెల్‌ చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు శరీర లోపలి భాగాలను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. కలబంద జెల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే దద్దుర్లలాంటివాటిని పోగొడుతుంది. మంచి మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. కూలింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఇంకా వేసవిలో మనం ఎదుర్కొనే సన్‌బర్న్స్‌, హీట్‌ రాషెస్‌ వంటి చర్మసంబంధమైన సమస్యలకు కలబంద బాగా పనిచేస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వారికి కూడా ఇది ఎంతో మంచిది. కలబంద జెల్‌ శిరోజాలకు కూడా మంచిది. జుట్టును సిల్కీగా ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న కలబందను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో పెద్ద డాక్టరున్నట్టే లెక్క... అంతేకాదు చర్మ పరిరక్షణ కోసం బ్యూటీషియన్‌ని ఆశ్రయించనవసరం లేదు...

ఇక ఆలస్యమెందుకు?
మీరు కూడా మీ ఇంట్లో కలబందను పెంచుకోండి. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

నిగనిగలాడే జుట్టు కోసం ...! for shiney and silkey hair

నిగనిగలాడే జుట్టు కోసం ...!



జుట్టు పొడిబారుతోంది అంటే తగిన పోషణ లేదని అర్థం. అలాగే నిర్లక్ష్యం చేస్తే కుదుళ్లు బలహీనపడటం, జుట్టురాలిపోవడం, జుట్టు చివర్లు పగిలిపోవడం జరుగుతుంది. అయితే ఈ సమస్యను ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అధిగమించవచ్చు.
హోమ్‌రెమిడీస్‌ ...
• వెన్నతో మసాజ్‌: పొడిబారినట్టుగా ఉండి, శిరోజాల చివర్లు చిట్లిపోతే వెన్నతో మసాజ్‌ చేసుకోవాలి. తరువాత షవర్‌ క్యాప్‌తో శిరోజాలను కవర్‌ చేసుకుని అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి.
• ఆలివ్‌ ఆయిల్‌తో: పొడిబారిన జుట్టు మెత్తగా, పట్టులా కావాలంటే గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌ను శిరోజాలకు పట్టించాలి. నలభైఐదు నిమిషాల తరువాత షాంపూ స్నానం చేసుకోవచ్చు.
• బ్లాక్‌టీతో: పొడిబారిన జుట్టు సహజసిద్దమైన మెరుపును సొంతం చేసుకోవాలంటే బ్లాక్‌టీని జుట్టుకు పట్టించండి. బ్లాక్‌టీ జుట్టు రంగును మెరుగుపరచడమే కాకుండా, మెరుపునిస్తుంది.
• గుడ్డుపచ్చసొన: జుట్టు దెబ్బతింటోంది అంటే సరైన పోషణ లేదని అర్థం. జుట్టుకు సరైన పోషకాలు అందాలంటే గుడ్డు పచ్చసొనను పట్టించండి. ఇది కండిషనర్‌గా, మాయిశ్చర్‌గా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొనను జుట్టుకు పట్టించాక ఒక గంటపాటు వదిలేసి తరువాత పర్‌ఫ్యూమ్డ్‌ షాంపూతో స్నానం చేయాలి.
• అవకడో, కొబ్బరి పాలు: అవకడోలో ఉండే నూనె, కొబ్బరిపాలు దెబ్బతిన్న జుట్టును బాగుచేయడానికి అద్భుతంగా ఉపకరిస్తాయి. ఒక అవకడోను తీసుకుని పేస్ట్‌ మాదిరిగా చేసి అందులో గుడ్డు పచ్చసొన, కొబ్బరిపాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చిన్నగా తలపై మర్దన చేస్తూ జుట్టుకు పట్టించాలి. ఒక అరగంటపాటు అలా వదిలేసి తరువాత షాంపూతో స్నానం చేయాలి.
• అరటిపండు, ఆల్మండ్‌ ఆయిల్‌: అరటిపండులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది జుట్టు మృదువుగా కావడానికి దోహదపడుతుంది. ఆల్మండ్‌ ఆయిల్‌లో ఉండే విటమిన్‌- ఇ జుట్టుకు తేమను, పోషణను అందిస్తుంది. అరటిపండు, ఆల్మండ్‌ అయిల్‌ కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
• యాపిల్‌ సిడెర్‌ వెనిగర్‌ మాస్క్‌ : దెబ్బతిన్న జుట్టుకు అద్భుతమైన హోమ్‌ రెమిడీ ఇది. ఒక టీస్పూన్‌ యాపిల్‌ సిడెర్‌ వెనిగర్‌, రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, మూడు ఎగ్‌వైట్లు కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. తరువాత షవర్‌ క్యాప్‌తో హెయిర్‌ను కవర్‌ చేసి పెట్టాలి. అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి.
• తేనె: హెయిర్‌ ఫాలికిల్స్‌కు తగిన పోషణ కావాలంటే తేనె ఒక్కటే మార్గం. తేనెలో కొంచెం నీరు కలిపి జట్టుకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
• పెరుగు: పొడిబారినజుట్టుకు పెరుగు సహజ కండిషనర్‌గా ఉపకరిస్తుంది. ఒక టీస్పూన్‌ యాపిల్‌ సిడెర్‌ వెనిగర్‌, ఒక టీస్పూన్‌ తేనె, అరకప్పు పెరుగు కలిపి కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

Sunday, 7 June 2015

40 Tips for Happy Health Life

40 Tips for Happy Health Life - MUST READ & SHARE
Health:
1. Drink plenty of water.
2. Eat breakfast like a king, lunch like a prince and dinner like a beggar.
3. Eat more foods that grow on trees and plants, and eat less food that is manufactured in plants.
4. Live with the 3 E’s — Energy, Enthusiasm, and Empathy.
5. Make time for prayer and reflection
6. Play more games.
7. Read more books than you did in 2012.
8. Sit in silence for at least 10 minutes each day.
9. Sleep for 7 hours.


Personality:
10. Take a 10-30 minutes walk every day —- and while you walk, smile.
11. Don’t compare your life to others’. You have no idea what their journey is all about.
12. Don’t have negative thoughts or things you cannot control. Instead invest your energy in the positive present moment.
13. Don’t over do; keep your limits.
14. Don’t take yourself so seriously; no one else does.
15. Don’t waste your precious energy on gossip.
16. Dream more while you are awake.
17. Envy is a waste of time. You already have all you need.
18. Forget issues of the past. Don’t remind your partner with his/her mistakes of the past. That will ruin your present happiness.
19. Life is too short to waste time hating anyone. Don’t hate others.
20. Make peace with your past so it won’t spoil the present.
21. No one is in charge of your happiness except you.
22. Realize that life is a school and you are here to learn. Problems are simply part of the curriculum that appear and fade away like algebra class but the lessons you learn will last a lifetime.
23. Smile and laugh more.
24. You don’t have to win every argument. Agree to disagree.


Community:
25. Call your family often.
26. Each day give something good to others.
27. Forgive everyone for everything.
28. Spend time with people over the age of 70 & under the age of 6.
29. Try to make at least three people smile each day.
30. What other people think of you is none of your business.
31. Your job won’t take care of you when you are sick. Your family and friends will. Stay in touch.


Life:
32. Do the right things.
33. Get rid of anything that isn’t useful, beautiful or joyful.
34. Forgiveness heals everything.
35. However good or bad a situation is, it will change.
36. No matter how you feel, get up, dress up and show up.
37. The best is yet to come.
38. When you awake alive in the morning, don’t take it for granted – embrace life.
39. Your inner most is always happy. So, be happy.

Last but not least:
40. Enjoy LIFE!

papaya face pack benifits


Saturday, 23 May 2015

Curry-Leaves-For-Hair-Growth


The curry tree’s leaves are used in many Indian dishes. However, they are mostly used in curries. That is why they are termed as curry leaves. They are also known as “sweet neem leaves”. This is one of the highly used herbs in India. Curry leaves add aroma and taste to your dishes; at the same time, they have many health benefits too.
Curry leaves prevent diarrhoea, they are good for the digestive system, they control bad cholesterol etc. Besides these, curry leaves are also good for the hair. They can help you on your way to healthy and radiant hair. Yes, you heard me right. This Indian herb can make your hair lustrous and shiny, and also aid hair growth. Read on to know the connection between curry leaves and hair growth.


How to Use Curry Leaves for Hair Growth:

1. Make a Hair tonic: Take fresh curry leaves and some coconut oil in a bowl. As you know, coconut oil is good for the hair. When mixed with curry leaves, it increases hair growth. Boil these two together until you see black residue forming. After the residue is formed, apply it onto your scalp directly after cooling it. Keep this mixture for one hour and then wash off with a mild shampoo. Apply this tonic twice a week and you will see the difference in just fifteen days. This hair tonic not only stimulates hair growth but also prevents the graying of hair. This is the best way to use curry leaves oil for hair growth.

2. Make a Hair Mask: Take some curry leaves and make a paste of them. Now mix this curry leaves’ paste with yoghurt and massage it on your hair. Keep this mixture on your scalp for 20-25 minutes and then wash off with a mild shampoo. Apply this mask every week religiously to see instant results in terms of hair growth. Besides increasing hair growth, this hair mask will also make your hair shiny, smooth and bouncy.

Tuesday, 12 May 2015

Nuts


Tuesday, 17 February 2015

Using mustard oil and Henna leaves For Faster Hair Growth


Using mustard oil and Henna leaves For Faster Hair Growth



About 250 ml of mustard oil should be boiled in a tin basin. About sixty grams of henna leaves should be gradually put in this oil till they are burnt in the oil. The oil should then be filtered using a cloth and stored. Regular massage of the head with the oil will produce Healthy hair.

Monday, 16 February 2015

Coconut oil and Garlic for faster Hair Regrowth




Coconut oil and Garlic for faster Hair Regrowth

Crush several garlic cloves and mix with two cups of coconut oil. Boil this for just a few minutes and stir gently. After the mixture cools, apply it to your scalp with a gentle massaging motion. Repeat these remedies two to three times a week for maximum results.

Friday, 6 February 2015

చుండ్రు ఇక కనిపించదు ..!


చుండ్రు ఇక కనిపించదు ..!

చికాకు తెప్పించే సమస్య చుండ్రు. రోజూ షాంపూ పెట్టి స్నానం చేసినా కొన్నిసార్లు చుండ్రు వదలదు. చుండ్రు రావడానికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన కారణమైనా, ఇతర కారణాలు కూడా ఉంటాయి. పొల్యూషన్‌, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నరాల జబ్బులు, శుభ్రత పాటించకపోవడం వంటివి కారణమవుతాయి. అయితే మెడికేటెడ్‌ షాంపూల అవసరం లేకుండానే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చుండ్రు దూరం చేసుకోవచ్చు.

అలాంటి చిట్కాలు
నాలుగు మీకోసం...!

• వారంలో రెండు రోజులు తలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయండి. ఆలివ్‌ ఆయిల్‌లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి. రాత్రి పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి తలచుట్టూ టవల్‌ లేక స్కార్ఫ్‌ కట్టుకుని పడుకుంటే ఆయిల్‌ బాగా అబ్జార్బ్‌ అవుతుంది.

• నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీటితో కడుక్కోవాలి.

• అలోవెరాలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది.

• మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి నెల పాటు చేయాలి. చుండ్రు ఛాయలు కనిపించకుండా పోతాయి.



How to reduce the fat in the body ఫ్యాట్‌ను తగ్గించే ఫుడ్స్‌...!



ఫ్యాట్‌ను తగ్గించే ఫుడ్స్‌...!

జీవనశైలిలో మార్పుల వల్ల, నిత్యం వ్యాయామం కొరవడటం వల్ల శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఫ్యాట్‌ను తగ్గించడానికి ఆరు రకాలైన సూపర్‌ఫుడ్స్‌ ఉన్నాయి.

శరీర లావునే కొవ్వు అని భావిస్తుంటాం. కానీ మన శరీరంలో మూడు రకాలైన ఫ్యాట్‌లు ఉన్నాయి. ఒకటి బాడీ ఫ్యాట్‌. రెండు బ్లడ్‌ ఫ్యాట్‌. మూడవది ఫుడ్‌ ఫ్యాట్‌. ఈ మూడింటికీ సన్నిహిత సంబంధం ఉంది. అయితే వీటి పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. బ్లడ్‌ ఫ్యాట్‌ని లిపిడ్స్‌ అంటాం. ఇవి రక్తంలో ట్రైగ్లిసరైడ్స్‌, కొలసా్ట్రల్‌ రూపంలో ఉంటాయి. కొలసా్ట్రల్‌ కాంపొనెంట్స్‌ కూడా శరీరానికి అవసరమే కానీ పరిమితికి మించి ఇవి ఉండకూడదు. ముఖ్యంగా లిపిడ్‌ ప్రొఫైల్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో తేడాలు తలెత్తితే రకరకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఫుడ్‌ ఫ్యాట్స్‌ అంటే ఆయిల్స్‌, నెయ్యి, వెన్న, హైడ్రోజెనేటడ్‌ ఫ్యాట్స్‌ మొదలైనవి. ఇవి కొలసా్ట్రల్‌ను పెంచుతాయి.
శరీరాన్ని స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కొలసా్ట్రల్‌ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఆరు సూపర్‌ ఫుడ్స్‌ ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది. ఊబకాయులు కారు. ఆరోగ్యంగా ఉంటారు. లిపిడ్స్‌ కూడా సాధారణస్థాయిలో ఉంటాయి.

గుడ్లు:

తెల్లసొనలో ప్రొటీన్లు బాగా ఉంటాయి. పచ్చసొనలో కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తెల్లసొన వల్ల మనలోని కొవ్వు సహజసిద్ధంగా కరుగుతుంది. గుడ్డు తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. ఉడకబెట్టిన తెల్లసొన, ఒక కప్పు పండ్లు, కూరగాయలు తింటే ఆ పూట భోజనం చేయాల్సిన పనిలేదు.

ఒమేగా 3 ఫుడ్స్‌:

ఇవి శరీరంలోని ఫ్యాట్‌ను , రక్తంలోని ఫ్యాట్‌ను నియంత్రిస్త్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. మకెరల్‌, ట్యూనా లాంటి చేపల్లో ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ బాగా ఉంటాయి. వీటిని తింటే ఎంతో మంచిది. అలాగే అవిశలు, అవిశనూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఊబకాయం తగ్గించుకోవడానికి డైటింగ్‌ చేసేవాళ్లు ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను సప్లిమెంట్ల రూపంలోగాని, ఆహారం రూపంలోగానీ తీసుకోవాలి.
పప్పుధాన్యాలు: వీటిల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుపదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే సమతులాహారం తీసుకున్నట్టే. ఉదాహరణకు రాజ్మా, పెసలు, సెనగలు లాంటి వాటిని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి మర్నాడు ఉదయం వాటిని ఉడకబెట్టుకుని తింటే శరీరానికి ఎంతో మంచిది. పప్పులను ఉడకబెట్టి తినడం వల్ల కడుపులో గ్యాసు ఏర్పడదు. సులభంగా జీర్ణం అవుతాయి. పొట్టుతో సహా తింటే ఇంకా మంచిది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల బ్లడ్‌ షుగర్‌, బ్లడ్‌ ఫ్యాట్స్‌ పెరగవు. అంతేకాదు ఏదో ఒకటి తినాలనే యావ ఉండదు. ఒకప్పుడు ఉడకబెట్టిన పప్పుధాన్యాలు తింటే ఆకలి ఉండదు. అవి తింటే ఆ పూట ఇక అన్నం తినాల్సిన పని లేదు.

ఓట్స్‌:

ఓట్స్‌లో అత్యధికస్థాయిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది బ్లడ్‌ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఓట్స్‌కు నెయ్యి, నూనె, వెన్నలాంటివి జోడించి తింటే శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. అలాకాకుండా ఓట్స్‌లో కొన్ని కూరగాయముక్కలు లేదా పాలు పోసి బాగా ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో కొద్దిగా తేనె లేదా సాల్ట్‌ పెప్పర్‌ వేసుకుని కూడా తినొచ్చు. ఓట్స్‌ తింటే తొందరగా ఆకలి వేయదు.

బాదంపప్పులు:

బాదం పప్పులు క్రేవింగ్‌ను అరికడతాయి. వీటిల్లో ప్రొటీన్‌, ఎసెన్షియల్‌ ఫ్యాట్‌, పీచుపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. న్యూట్రియంట్స్‌ కూడా అధికంగా ఉంటాయి. ఒక వ్యక్తి రోజుకు 45 బాదంపప్పులు తినొచ్చు. స్నాక్స్‌లా కూడా వీటిని తీసుకోవచ్చు. ఇవి రక్తంలోని కొలసా్ట్రల్‌ను నియంత్రిస్తాయి. వీటిని తినడం వల్ల కొలసా్ట్రల్‌ పెరగదు.

పళ్లు, కూరగాయలు:

తక్కువ క్యాలరీలిచ్చే ఆహారం పళ్లు, కూరగాయలు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కూరగాయలను ఉడకబెట్టి తింటే బరువు బాగా తగ్గుతారు. తాజా పళ్లు తిన్నా కూడా బరువు తగ్గుతారు. సలాడ్‌లు కూడా మంచివే. వాటిల్లో రుచికోసం మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తినొచ్చు. సలాడ్‌లను స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. పళ్లు, కూరగాయల్లో సొల్యుబుల్‌, నాన్‌సొల్యుబుల్‌ పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి బ్లడ్‌ ఫ్యాట్‌ అంటే కొలసా్ట్రల్‌ని పెరగకుండా అరికడతాయి.

What to do for silkey & Shiney Hair పట్టులాంటి కురుల కోసం....



పట్టులాంటి కురుల కోసం....

జుట్టు ఊడిపోతుందని, పలుచబడిపోతుందని, మెరుపు కోల్పోతుందని బాధపడని వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కాలుష్యం, ఒత్తిడి, పోషకాహారలేమి... ఇటువంటి పలు కారణాల ప్రభావం మాత్రం జుట్టు మీదే భారీగానే చూపెడుతోంది. వీటి నుండి తప్పించుకుని జుట్టును సంరక్షించుకునేందుకు వంటింటిని దాటి పోనక్కర్లేదు అంటున్నారు సౌందర్య నిపుణులు. వంటింట్లో లభించే పదార్థాలతోనే మృదువైన, ఆరోగ్యకరమైన, పట్టులాంటి జుట్టును సొంతం చేసుకునేందుకు కొన్ని చిట్కాలను కూడా చెప్తున్నారు వాళ్లు.

అవేంటంటే...

ఉల్లిరసం: ఉల్లిలో సల్ఫర్‌ పుష్కలంగా ఉంటుంది. త్వచాల్లో ఉండే కొల్లాజెన్‌ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సల్ఫర్‌ది ప్రధాన పాత్ర. అదే జుట్టు పెరగడంలోనూ కీలకం అన్నమాట. ఇందుకు ఏం చేయాలంటే... ఎరుపు రంగు ఉల్లిపాయలు లేదా సాంబారు ఉల్లిపాయల్ని చిన్నచిన్న ముక్కలుగా తరిగి రసం తీయాలి. ఆ రసాన్ని మాడు మీద రాసుకుని పావు గంట తరువాత మైల్డ్‌షాంపూతో కడిగేయాలి.

గుడ్డు మాస్క్‌: గుడ్డులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రొటీనే కాకుండా సల్ఫర్‌, జింక్‌, ఐరన్‌, సెలీనియం, ఫాస్పరస్‌, అయోడిన్‌లు కూడా ఉంటాయి ఇందులో. ఇవి జుట్టు ఎదుగుదలకి దోహదం చేస్తాయి. గుడ్డు తెల్లసొనలో ఒక టీస్పూను ఆలివ్‌ నూనె, తేనె వేసి బాగా కలిపితే మెత్తటి పేస్ట్‌లా అవుతుంది. జుట్టు అంతటా ఈ పేస్ట్‌ను పట్టించి 20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలి.

మెంతులు: మెంతులు జుట్టు పెరుగుదలలో సాయపడడమే కాకుండా జుట్టుకున్న సహజమైన రంగు పోకుండా కాపాడతాయి. ఒక టీస్పూను మెంతి గుజ్జులో రెండు టీస్పూన్ల కొబ్బరి పాలు పోసి కలపాలి. దీన్ని మాడు, జుట్టుకి పట్టించి అరగంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి.

బంగాళా దుంపల రసం: బంగాళా దుంప రసంలో జుట్టు పెంచే లక్షణాలున్నాయనే విషయం తక్కువ మందికి తెలుసు కావొచ్చు. కాని ఇందులో ఉండే విటమిన్‌ ఎ, బి, సిలు జుట్టుకి ఎంతో ముఖ్యం. ఒకవేళ జుట్టు పలుచబడే (అలోపేషియా) సమస్య ఉంటే బంగాళాదుపం రసం చాలా బాగా పనిచేస్తుంది. బంగాళాదుంపల రసాన్ని మాడుకి రాసుకుని పావుగంట తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.

హెన్నా ప్యాక్‌: హెన్నా సహజసిద్ధమైన కండీషనర్‌, వెంట్రుకల మూలాలకి బలాన్నిచ్చి జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ ప్యాక్‌ తయారీ ఎలాగంటే ఒక కప్పు హెన్నా పొడిలో అర కప్పు పెరుగు కలపాలి. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు హెన్నా మిశ్రమాన్ని పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.

గ్రీన్‌ టీ: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాచి. గోరువెచ్చటి గ్రీన్‌టీని మాడు మీద రాసుకుని గంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఉసిరి: ఇది యాంటీఆక్సిడెంట్ల భాండాగారం. విటమిన్‌-సి కూడా ఉంటుంది. ఉసిరి జుట్టును ఆరోగ్యకరంగా ఉంచడమే కాకుండా జుట్టు పిగ్మెంటేషన్‌ పాడు కాకుండా చూస్తుంది. అంటు జుట్టు రంగు మారకుండా ఉంటుందన్నమాట. రెండు టీస్పూన్ల ఉసిరిపొడి లేదా రసంలో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి మాడుకు రాసుకుని ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.

మిరియాలు: నల్ల మిరియాలు ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి. వీటిలో ఉండే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ మాడుకి తగిన తేమను అందిస్తాయి. రెండు టీస్పూన్ల న ల్ల మిరియాల్లో అర కప్పు నిమ్మరసం వేసి మెత్తటి గుజ్జులా మిక్సీలో పట్టాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లకు పట్టించి గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రభావం లోతుగా ఉంటుంది. అరగంట తరువాత తలస్నానం చేయాలి.